https://oktelugu.com/

Mechanic Rocky: మెకానిక్ రాకీ ట్విట్టర్ టాక్: విశ్వక్ కి మరో షాక్ తప్పదా? ఆడియన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్!

విశ్వక్ సేన్ ఈసారి మెకానిక్ పాత్రలో ప్రేక్షకులను పలకరించారు. ఆయన లేటెస్ట్ మూవీ మెకానిక్ రాకీ నవంబర్ 22న థియేటర్స్ లోకి వచ్చేసింది. యూఎస్ ప్రీమియర్స్ ముగిశాయి. మూవీ చూసిన ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. మరి మూవీ ఎలా ఉంది? ప్రేక్షకులకు నచ్చిందా?

Written By:
  • Neelambaram
  • , Updated On : November 22, 2024 / 08:07 AM IST

    Mechanic Rocky

    Follow us on

    Mechanic Rocky: 2024లో విశ్వక్ సేన్ కి మిశ్రమ ఫలితాలు అందుకున్నాడు. ఆయన నటించిన ప్రయోగాత్మక చిత్రం గామి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కమర్షియల్ గా కూడా ఆడింది. గామి చిత్రంలో విశ్వక్ సేన్ అఘోరాగా నటించడం విశేషం. ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పర్లేదు అనిపించుకుంది. యావరేజ్ గా నిలిచింది. ఈ ఏడాది విశ్వక్ సేన్ నుండి వస్తున్న మూడో చిత్రం మెకానిక్ రాకీ. ఈ చిత్రానికి రవితేజ ముళ్ళపూడి దర్శకుడు. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాధ్ హీరోయిన్స్ గా నటించారు. సునీల్, నరేష్ ఇతర కీలక రోల్స్ చేశారు.

    మెకానిక్ రాకీ మూవీ కథ విషయానికి వస్తే.. హీరో విశ్వక్ సేన్ ఒక మెకానిక్. గ్యారేజ్ తో హీరో కుటుంబానికి, తనకు అనుబంధం పెనవేసుకుని ఉంటుంది. అనుకోని కారణాల వలన విశ్వక్ సేన్ గ్యారేజ్ కోల్పోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు హీరో విశ్వక్ సేన్ ఎలా ప్రతిఘటించాడు? అనేది సిల్వర్ స్క్రీన్ పై చూడాలి. కాగా మెకానిక్ రాకీ చిత్రానికి మిశ్రమ స్పందన దక్కుతుంది. ఇది రొటీన్ మాస్ కమర్షియల్ సినిమా అంటున్నారు.

    అక్కడక్కడా కామెడీ సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. అయితే పూర్తి స్థాయిలో కామెడీ వర్క్ అవుట్ కాలేదు. కొన్ని సన్నివేశాలు మినహాయిస్తే మూవీ బోరింగ్ గా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో కథ ముందుకు వెళుతున్న భావన కలగదు. కామెడీ ప్రధానంగా ఫస్ట్ హాఫ్ నడిపించాలని దర్శకుడు భావించాడు. కానీ అది ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుందని అంటున్నారు. కాగా ఫస్ట్ హాఫ్ తో పోల్చితే సెకండ్ హాఫ్ బెటర్. కథలోని కొన్ని ట్విస్ట్స్ ఆకట్టుకుంటాయట. విశ్వక్ నటన బాగుంది. కాకపోతే గతంలో ఆయన చేసిన కొన్ని పాత్రలను మెకానిక్ రాకీ రోల్ గుర్తు చేస్తుందని అంటున్నారు.

    ట్విస్ట్స్ తో పాటు కామెడీ పార్ట్ కూడా వర్క్ అవుట్ అయితే మూవీ చాలా బాగా ఉండేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. డైరెక్టర్ స్క్రీన్ ప్లే, సన్నివేశాలు మరింత ఎఫెక్టివ్ గా రాసుకోవాల్సిందని అంటున్నారు. ఇక సినిమా ఫలితం ఏమిటనేది పూర్తి రివ్యూ వస్తే కానీ స్పష్టత రాదు. విశ్వక్ సేన్ ఫ్యాన్స్ మాత్రం ఎంజాయ్ చేసే అవకాశం ఉంది.