https://oktelugu.com/

Horoscope Today: ఈ రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి తోడు ఉండనుంది.. పట్టిందల్లా బంగారమే..

ఈ రాశి విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఉద్యోగులు సీనియర్ల నుంచి మద్దతు పొందుతారు. ప్రియమైన వారి కోసం సమయాన్ని కేటాయించకపోవడంతో వారితో వాగ్వాదం ఉంటుంది. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.

Written By:
  • Srinivas
  • , Updated On : November 22, 2024 / 07:46 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: గ్రహాల మార్పు కారణంగా కొన్ని రాశులపై ప్రభావం ఉంటుంది. శుక్రవారం ద్వాదశరాశులపై పూర్వ ఫాల్గుణ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో బ్రహ్మయోగం, రవి యోగం ఏర్పడతాయి. ఈ కారణంగా కొన్ని రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండనుంది. మరికొన్ని రాశుల వ్యాపారులు శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. మిగతా రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

    మేష రాశి: వ్యాపారాలు పెట్టుబడి నుంచి లాభాలు పొందుతారు. ఉద్యోగులకు కొత్త ఆదాయం మార్గాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. విదేశాల్లో ఉండే విద్యార్థుల నుంచి తల్లిదండ్రులు శుభవార్తలు వింటారు.

    వృషభ రాశి: ఈ రాశి విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఉద్యోగులు సీనియర్ల నుంచి మద్దతు పొందుతారు. ప్రియమైన వారి కోసం సమయాన్ని కేటాయించకపోవడంతో వారితో వాగ్వాదం ఉంటుంది. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.

    మిథున రాశి: వ్యాపారవులకు కొత్త అవకాశాలు ఏర్పడతాయి. విద్యార్థుల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు.

    కర్కాటక రాశి: పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. చట్టాపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. వ్యాపారులకు శత్రువుల బెడద ఉంటుంది.

    సింహారాశి: భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు కొత్త ప్రణాళికలు వేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య సమస్య ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలి. ఉద్యోగులు సీనియర్ల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.

    కన్య రాశి: వ్యాపారులకు కొన్ని కారణాల వల్ల పనులు వాయిదా పడతాయి. ఇతరులకు ధన సహాయం చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు. కొన్ని సమస్యల పరిష్కారం కోసం స్నేహితుల సహకారం ఉంటుంది.

    తుల రాశి: ఈ రాశి వారికి ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. విలాసానికి అదరంగా ఖర్చు చేస్తారు. ఉద్యోగులుకు తోటి వారి సహకారం ఉండటంతో కార్యాలయంలో ఆనందంగా ఉంటారు. వ్యాపారులకు ఒత్తిడి ఉంటుంది.

    వృశ్చిక రాశి: వ్యాపారంలో లాభదాయకమైన పెట్టుబడును పెడతారు. ఉద్యోగులకు ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. కుటుంబానికి సంబంధించి కీలకమైన తీసుకుంటారు. దీంతో ఉల్లాసంగా ఉంటారు.

    ధనస్సు రాశి: కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఇదే మంచి అవకాశం. ఇంట్లో జరిగే వివాహానికి అడ్డంకులు తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉంటే నేటితో పరిష్కారం అవుతుంది. దీంతో ప్రశాంతంగా ఉంటారు.

    మకర రాశి: ఎవరితోనైనా విభేదాలు ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలి. లేకుంటే పనుల్లో ఆటంకాలు సృష్టిస్తారు. పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. విదేశాల్లో ఉండే విద్యార్థుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు.

    కుంభరాశి: ఇన్నాళ్లు ఎదుర్కొంటున్న కష్టాల నుంచి బయటపడతారు. ఉద్యోగులకు అనుకూల వాతావరణ ఉంటుంది. సీనియర్ల నుంచి ప్రశంసలు అందుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు.

    మీనరాశి: పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఇంట్లో వివాదాలు ఉంటే పరిష్కరించుకోవాలి. లేదంటే పెద్దదిగా మారుతుంది. బంధువుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు.