spot_img
Homeఎంటర్టైన్మెంట్Sugali Preethi: వైసీపీ చేతిలో బ్రహ్మాస్త్రంగా మారిన సుగాలి ప్రీతి తల్లి.. ఇరకాటంలో పడ్డ పవన్...

Sugali Preethi: వైసీపీ చేతిలో బ్రహ్మాస్త్రంగా మారిన సుగాలి ప్రీతి తల్లి.. ఇరకాటంలో పడ్డ పవన్ కళ్యాణ్..

Sugali Preethi: ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి మనమంతా చూస్తూనే ఉన్నాం . ముఖ్యంగా వైసీపీ పార్టీ ఇంకా పాత పద్ధతులనే అనుసరిస్తూ ముందుకు వెళ్తోంది. వాళ్ళ వ్యూహాలను చిన్న పిల్లలు కూడా కనిపెట్టేలా ఉన్నారు. జెన్ జీ కాలం లో ఇంకా ఈ పాత పద్ధతులు ఏంటి?, ఇకనైనా మారండి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ గా వైసీపీ పార్టీ కి సుగాలి ప్రీతీ తల్లి పార్వతి బ్రహ్మాస్త్రం గా మారిపోయింది. సుగాలి ప్రీతీ అనే పేరు తెలియనోళ్లు ఎవ్వరూ ఉండరు , ఆమె కోసం ప్రతిపక్షం లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఏ రేంజ్ లో పోరాడాడో మన కళ్లారా చూసాము. 2017 లో సుగాలి ప్రీతీ అనే చిన్నారి స్కూల్ రూమ్ లో ఆత్మహత్య చేసుకొని చనిపోయింది.

కానీ అది ఆత్మహత్య కాదు , కావాలని ఆ బిడ్డపై అఘాయిత్యం చేసి చంపేశారు అని నిర్ధారణ అయ్యింది. ఈ అంశాన్ని తీసుకొని పోరాటం చేయడానికి అప్పట్లో ఎవ్వరు ముందుకు రాలేదు. ఎందుకంటే ఇందులో నిందితులుగా రాజకీయ నేపథ్యం ఉన్నోళ్లు ఉన్నారు. అందుకే కేవలం సోషల్ మీడియా లో ట్రెండింగ్ కి మాత్రమే పరిమితమైన ఈ అంశాన్ని పవన్ కళ్యాణ్ తన భుజాన వేసుకున్నారు. సుగాలి ప్రీతీ తల్లికి అండగా, ఆమెకు న్యాయం చేయడం కోసం లక్షలాది మంది జనం తో కవాత్తు నిర్వహించి , అప్పటి వైసీపీ ప్రభుత్వం పై తీవ్రమైన ఒత్తిడి కలిగేలా చేశారు. జనాల్లో ఈ అంశం పై ప్రభుత్వ అలసత్వం పట్ల నిరసన వ్యక్తం అవుతుండడంతో ప్రభుత్వం క్రిందకు దిగి ఈ కేసు ని CID కి అప్పగిస్తున్నట్టు ఒక జీవో ని విడుదల చేసింది . కానీ అది డమ్మీ జీవో అని స్వయంగా సుగాలి ప్రీతీ తల్లి గతంలో మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

వైసీపీ ప్రభుత్వ హయాం లోనే ఆధారాలన్నీ మిస్ అయ్యాయి. ఈ విషయం లో ఎలాంటి న్యాయం జరగదు అనేది జగన్ హయాం లోనే అందరికీ తెలుసు. దీంతో ఆమెకు ఒక ప్రభుత్వం తరుపున ఒక భూమి, ఇల్లు , ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించారు. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ తీసుకున్న మొదటి కేసు ఇదే. విచారణ చేపట్టి, పరిశీలించిన తర్వాత ఆధారాలు మిస్ అయ్యాయి అనే విషయం ఆయనకు తెలిసింది. ఇప్పుడు ఆయన కూడా న్యాయం చెయ్యలేని పరిస్థితి ఏర్పడింది. ఈ అంశం లో పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు , స్వయంగా సుగాలి ప్రీతీ తల్లి పర్వతే ఎమ్మెల్యే అయినా కూడా న్యాయం చెయ్యలేదు , ఎందుకంటే ఆధారాలు లేవు కాబట్టి. ఇవన్నీ ఆమెకు తెలిసి కూడా నేడు మీడియా ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది.

నిన్న మొన్నటి వరకు జనాల్లో ఈమెపై సానుభూతి ఉండేది , పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఈ విషయం లో ఈమె వైపే ఉండేవారు. కానీ ఎప్పుడైతే ఈమె రావణ్ అరెస్ట్ ని వ్యతిరేకిస్తూ , వైసీపీ స్క్రిప్ట్ ని చదవడం మొదలు పెట్టిందో , ఈమెపై జనాల్లో సానుభూతి పోయింది. వైసీపీ ఈమెని రాజకీయంగా ఉపయోగించుకుంటుంది అనే విషయం చిన్న పిల్లవాడికి కూడా అర్థం అయ్యేలా మీడియా ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ పై ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతోంది. ఇకపై ప్రభుత్వ తప్పుల మీద ప్రశ్నిస్తాను అంటోంది. పవన్ కళ్యాణ్ పై కేసులు పెడతాను అంటోది. ఎవ్వరు అండగా లేని సమయం లో నీకోసం నిలబడి పోరాడిన ఏకైక వ్యక్తి మీద ఇలాంటి ఆరోపణలు చేయడం చాలా ఛండాలంగా ఉంది అంటూ సోషల్ మీడియా లో ఈమెపై విరుచుకుపడుతున్నారు నెటిజెన్స్. రాబోయే రోజుల్లో ఈమెని వైసీపీ పవన్ మీదకు బ్రహ్మాస్త్రం లాగా వాడనుండి , వచ్చే ఎన్నికల్లో ఈమెని పిఠాపురం లో పవన్ కళ్యాణ్ కి సవాలు చేస్తూ, వైసీపీ ఈమెకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version