Game Changer Movie : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆ చిత్రం పై హైప్ పెంచడమే కాకుండా, రాజకీయాల్లో ప్రకంపనలు కూడా సృష్టించింది. వైసీపీ పార్టీ అభిమానులు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరిగిన కొన్ని సంఘటనలపై తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ద్వారా నిరసన తెలుపుతున్నారు. ‘గేమ్ చేంజర్’ చిత్రాన్ని థియేటర్స్ లో చూడబోమని, ఈ చిత్రాన్ని మన పార్టీ అభిమానులందరూ బ్యాన్ చేయాలనీ, థియేటర్ కి వెళ్ళాలి అనుకునే వాళ్ళ మైండ్ ని చెడిపేయాలంటూ వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఒక ప్రకటన ఇచ్చింది. వాళ్లకు అంతలా కోపం రప్పించేంత ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏమి జరిగింది?, ఎందుకు బ్యాన్ చేయాలని క్యాంపైన్ చేస్తున్నారు అనేది ఇప్పుడు వివరంగా మనం ఈ స్టోరీ లో చూద్దాము. అయితే నిన్నటి ఈవెంట్ ముందుగా కమెడియన్ పృథ్వీ రాజ్ తో మొదలైంది.
‘గేమ్ చేంజర్’ చిత్రంలో ముఖ్యమైన పాత్ర పోషించిన ఆయన, ఒకప్పుడు వైసీపీ పార్టీ లో చేరి, టీటీడీ బోర్డు చైర్మన్ గా కొనసాగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ పార్టీ కి రాజీనామా చేసి జనసేన పార్టీ లో చేరాడు. అయితే నిన్నటి ఈవెంట్ లో ఆయన గేమ్ చేంజర్ చిత్రం గురించి మాట్లాడుతూ ‘గేమ్ చేంజర్ లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను కళ్ళకి కట్టినట్టు చూపించారు. ఇప్పుడు జరిగేవి మొత్తం శంకర్ గారు నాలుగేళ్ల క్రితమే ఊహించి సన్నివేశాలు రాసారు. ఒకవేళ ఈ చిత్రం ముందుగానే విడుదల అయ్యుంటే వైసీపీ పార్టీ కి 11 కూడా వచ్చేవి కాదు, సున్నా సీట్లు వచ్చేవి’ అంటూ కామెంట్స్ చేసాడు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ సోషల్ మీడియా వింగ్ భగ్గుమంది. థర్డ్ గ్రేడ్ నటులతో ఒక సినిమా ఈవెంట్ లో మా పార్టీ పై విమర్శలు చేస్తారా?, నువ్వేమి గ్లోబల్ స్టార్ వి, గల్లీ స్టార్ అన్ని పెట్టుకో అంటూ రామ్ చరణ్ పై విరుచుకుపడ్డారు.
అంతే కాకుండా ఎలా అయినా ఈ సినిమాకి డ్యూటీ చేసి నెగటివ్ టాక్ రప్పిస్తాము అంటూ రామ్ చరణ్ ని ట్యాగ్ చేసి వార్నింగ్స్ ఇస్తున్నారు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ కూడా పరోక్షంగా వైసీపీ ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ పై కూడా వాళ్ళు విరుచుకుపడుతున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత రామ్ చరణ్ అభిమానులు వైసీపీ పార్టీ అభిమానులకు వార్నింగ్ ఇస్తూ ‘మిమ్మల్ని..మీ పార్టీ ని బ్యాన్ చేసి, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా జనాలు నడ్డి విరగ్గొట్టి మూలాన కూర్చోబెట్టారు. మీ అన్న జగన్ జనాలకు మొహం చూపించుకోలేక రాష్ట్రం వదిలి పారిపోయి బెంగళూరు లో దాక్కున్నాడు. మీరేంట్రా మమ్మల్ని బ్యాన్ చేసేది. రామ్ చరణ్ వెంట్రుక కూడా కడపలేరు’ అంటూ పోస్టులు వేస్తున్నారు.