https://oktelugu.com/

Game Changer Trailer : హాలీవుడ్ చిత్రాల జాబితాలోకి చేరిన రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ ట్రైలర్..ఇంతటి రెస్పాన్స్ ని ఎవ్వరూ ఊహించి ఉండరు!

యూట్యూబ్ లో అన్ని భాషలకు కలిపి దాదాపుగా 90 మిలియన్ వ్యూస్ ని రప్పించుకున్న ఈ చిత్రం. ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్, షేర్ చాట్ మరియు ఇతర మాధ్యమాల ద్వారా ఈ స్థాయి వ్యూస్ ని రప్పించుకుందని, ఇది కేవలం టాలీవుడ్ రికార్డు మాత్రమే కాదని, వరల్డ్ రికార్డ్స్ లో ఒకటి అని చెప్పుకొస్తున్నారు. ఇప్పటి వరకు 24 గంటల్లో కేవలం హాలీవుడ్ చిత్రాలకు మాత్రమే ఈ రేంజ్ వ్యూస్ వచ్చాయని. ఆ జాబితాలోకి ఇప్పుడు గేమ్ చేంజర్ ట్రైలర్ కూడా చేరిందని అంటున్నారు

Written By:
  • Vicky
  • , Updated On : January 5, 2025 / 09:33 PM IST

    Game Changer Trailer Record

    Follow us on

    Game Changer Trailer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం విడుదలకు ముందే అరుదైన రికార్డ్స్ ని నెలకొల్పుతూ అభిమానులను గర్వం గా కాలర్ ఎగరేసుకునేలా చేస్తుంది. ఇప్పటికే ఓవర్సీస్ లో 1 మిలియన్ డాలర్స్ కి పైగా ప్రీ సేల్స్ ని దక్కించుకున్న ఈ చిత్రం, త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ని ప్రారంభించుకోనుంది. రీసెంట్ గా విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వింటేజ్ శంకర్ మార్క్ కమర్షియల్ సినిమా అంటే ఇదేనని, ఇండియన్ 2 చిత్రం తో శంకర్ పని ఇక అయిపోయింది అని అనుకున్న వాళ్లందరికీ ఈ సినిమా గట్టి సమాధానం చెప్తుందని అభిమానులు ట్రైలర్ ని చూసిన తర్వాత చెప్పుకొచ్చారు. ఇదంతా పక్కన పెడితే ఈ ట్రైలర్ కి సోషల్ మీడియా లోని అన్ని ప్లాట్ ఫార్మ్స్ కి కలిపి 180 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయని మేకర్స్ అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

    యూట్యూబ్ లో అన్ని భాషలకు కలిపి దాదాపుగా 90 మిలియన్ వ్యూస్ ని రప్పించుకున్న ఈ చిత్రం. ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్, షేర్ చాట్ మరియు ఇతర మాధ్యమాల ద్వారా ఈ స్థాయి వ్యూస్ ని రప్పించుకుందని, ఇది కేవలం టాలీవుడ్ రికార్డు మాత్రమే కాదని, వరల్డ్ రికార్డ్స్ లో ఒకటి అని చెప్పుకొస్తున్నారు. ఇప్పటి వరకు 24 గంటల్లో కేవలం హాలీవుడ్ చిత్రాలకు మాత్రమే ఈ రేంజ్ వ్యూస్ వచ్చాయని. ఆ జాబితాలోకి ఇప్పుడు గేమ్ చేంజర్ ట్రైలర్ కూడా చేరిందని అంటున్నారు. వరల్డ్ వైడ్ గా ‘డెడ్ పూల్ & వోల్వరైన్’ సినిమా ట్రైలర్ కి 365 మిలియన్ వ్యూస్ రాగా, ‘స్పైడర్ మ్యాన్ నో వే హోమ్’ చిత్రం ట్రైలర్ కి 355 మిలియన్ వ్యూస్, ‘ఎవెంజర్స్ ఎండ్ గేమ్’ చిత్రానికి 289 మిలియన్ వ్యూస్ వచ్చాయని అంటున్నారు.

    ఇక ఆ తర్వాత సూపర్ మ్యాన్ చిత్రం ట్రైలర్ కి 250 మిలియన్ వ్యూస్, ‘ట్రాన్స్ ఫార్మర్స్ ది రైజ్ ఆఫ్ బీస్ట్’ చిత్రానికి 238 మిలియన్ వ్యూస్, ‘ఎవెంజర్స్ ఇన్ఫినిటీ వార్’ చిత్రం ట్రైలర్ కి 230 మిలియన్ వ్యూస్, ‘ది లయన్ కింగ్’ ట్రైలర్ కి 224 మిలియన్ వ్యూస్, ఆ తర్వాత రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రానికి 180 మిలియన్ వ్యూస్ వచ్చాయని, మరోసారి రామ్ చరణ్ తాను గ్లోబల్ స్టార్ ఎందుకో నిరూపించుకున్నాడని ఆయన అభిమానులు గర్వం గా చెప్పుకుంటున్నారు. ఇప్పటికీ ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో టాప్ స్థానంలోనే ట్రెండ్ అవుతుంది. సినిమా విడుదల అయ్యేలోపు ఈ థియేట్రికల్ ట్రైలర్ ఇంకెన్ని రికార్డ్స్ ని బద్దలు కొడుతుందో చూడాలి.