YouTuber Naga Durga: యూట్యూబ్ లో తెలంగాణ ఫోక్ సాంగ్స్ తో యూత్ ఆడియన్స్ ని ఒక రేంజ్ లో అలరించిన నాగ దుర్గ(Naga Durga) ఇప్పుడు తమిళ సినిమాలో హీరోయిన్ గా బంపర్ ఛాన్స్ కొట్టేసింది. ప్రముఖ హీరో ధనుష్ మేనల్లుడు పవీష్ హీరోగా నటించే ఒక సినిమాలో ఈమెకు హీరోయిన్ ఛాన్స్ దక్కింది. పవీష్ గతం లో ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ అనే చిత్రం ద్వారా మన తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యారు. ఈ సినిమా అటు తమిళం లోనూ, ఇటు తెలుగు లోనూ అనుకున్నంతగా సక్సెస్ సాధించలేకపోయింది. ఇప్పుడు రెండవ సినిమా తో ఆయన మరోసారి హీరో గా తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. ఇక నాగ దుర్గ విషయానికి వస్తే అనేక ఇంటర్వ్యూస్ లో ఈమె సినిమా అవకాశం వస్తే చేస్తారా అని అడిగిన ప్రశ్నకు ఆమె చెప్పిన సమాదానాలు బాగా వైరల్ అయ్యాయి.
Also Read: చిరంజీవి తో కలిసి నటించడం పై ప్రభాస్ హీరోయిన్ హాట్ కామెంట్స్..మండిపడుతున్న ఫ్యాన్స్!
ఆమె మాట్లాడుతూ ‘రెగ్యులర్ హీరోయిన్ పాత్రలు అయితే చెయ్యను. కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే చేస్తాను’ అని చెప్పింది. అందులో భాగంగానే ఈ తమిళ సినిమాని ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. కానీ ఇలాంటి ఆలోచనలు హీరోయిన్స్ ఇండస్ట్రీ లో వెంటనే సక్సెస్ లు చూడలేకపోవచ్చు కానీ, భవిష్యత్తు మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి కాలం లో అందాల ఆరబోతల చేసే హీరోయిన్స్ కంటే టాలెంట్ ఉన్న హీరోయిన్స్ ఎక్కువ కాలం ఇండస్ట్రీ లో కొనసాగుతున్నారు. నగదుర్గా కూడా ఆ రేంజ్ కి వెళ్తుందో లేదో చూడాలి. ఇప్పటి వరకు ఈమె యూట్యూబ్ లో చేసిన ప్రతీ పాట సెన్సేషనల్ హిట్ అయ్యింది. అందం, అభినయం తో పాటు డ్యాన్స్ కూడా అదరగొట్టింది. కాపోళ్ల ఇంటికాడ, జిల్లెలమ్మ జిట్టా, తిన్నా తీరం పడ్తలేల, దారిపంటట్లుండు వంటి పాటలకు యూట్యూబ్ లో కోట్ల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. ఇప్పటికీ కూడా ఈ పాటకు ప్రతీ వారం మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి. మరి నాగ దుర్గ సినిమాల్లో బిజీ అయితే ఇలాంటి ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తుందో లేదో చూడాలి.