Senior NTR : నందమూరి తారక రామారావుకి క్రమ శిక్షణ కలిగిన నటుడిగా పేరుంది. ఆయన సెట్స్ లో టైం అంటే టైం కి ఉంటారట. అందుకే ఆయన సినిమాలో పని చేసే నటులు, సాంకేతిక నిపుణులు చాలా జాగ్రత్తగా ఉంటారట. చెప్పిన సమయానికి హాజరువుతారట. తెల్లవారుఝాము మూడు గంటలకే ఎన్టీఆర్ నిద్ర లేచేవారట. వ్యాయామం, యోగ చేసి. అల్పాహారం తీసుకునేవారట. ఉదయాన్నే నాటు కోడి మాంసం తినడం కూడా ఆయన అలవాట్లలో ఒకటని అంటారు.
ఎంతటి వారికైనా ఏదో ఒక వ్యసనం ఉంటుంది. ఎన్టీఆర్ కి కూడా ఒక వ్యసనం ఉందట. ఆ క్రమంలో ఒక కొడుకు నిలదీశాడట. విషయంలోకి వెళితే ఎన్టీఆర్ ప్రతి రోజూ ఉదయాన్నే ఒక చుట్ట తాగేవారట. అది ఆయన దిన చర్యలో భాగంగా ఉండేదట. కాగా హరికృష్ణకు ధూమపానం అలవాటు ఉంది. ఆయన సిగరెట్స్ ఎక్కువగా తాగేవారట. దాంతో పలుమార్లు హరికృష్ణను తండ్రి ఎన్టీఆర్ హెచ్చరించారట. హరి నువ్వు సిగరెట్స్ తాగడం మానేయాలని చెప్పేవాడట.
ఎన్టీఆర్ కుమారుల్లో చిన్నవాడైన జయ శంకర కృష్ణ ఒకరోజు ఎన్టీఆర్ ని ఇదే విషయమై నిలదీశాడట. నాన్న నువ్వు చుట్ట తాగుతూ… హరి అన్నను సిగరెట్స్ మానేయమని చెప్పడం ఏమైనా బాగుందా? అని అడిగాడట. ఆ మాటకు ఎన్టీఆర్.. అవును కదా, అనుకున్నాడట. తదుపరి రోజు నుండి ఎన్టీఆర్ చుట్ట తాగడం ఆపేశాడట. ఎన్టీఆర్ కి అది వ్యసనం కాదు. నటుడికి కంఠం చాలా అవసరం. ఉదయాన్నే చుట్ట తాగితే కంచు కంఠం సొంతం అవుతుందని ఆయన నమ్మేవారట. అయినప్పటికీ కొడుకు ప్రశ్నకు సమాధానంగా ఆయన చుట్ట మానేశాడట.
కాగా ఇప్పుడు అదే అలవాటును బాలకృష్ణ కొనసాగిస్తున్నారు. ఆయన కూడా ఉదయాన్నే ఒక చుట్ట తాగుతాడట. ఈ విషయాన్ని బాలకృష్ణ స్వయంగా వెల్లడించాడు. బాలకృష్ణకు తండ్రి నుండి సంక్రమించిన మంచి వాయిస్ ఉంది. డైలాగ్ డెలివరీలో బాలకృష్ణ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలకృష్ణను మాస్ హీరోగా నిలబెట్టిన చిత్రాల్లో ఆయన డైలాగ్ డెలివరీ ఒకటి.
వెండితెరపై తిరుగులేని ముద్ర వేసిన ఎన్టీఆర్ రాజకీయాల్లో కూడా రాణించారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లో అధికారం చేపట్టారు. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. లక్ష్మి పార్వతిని ఆయన రెండో వివాహం చేసుకోవడం కుటుంబంలో చీలికలకు కారణమైంది. 1995లో పార్టీ నుండి ఎన్టీఆర్ బహిష్కరించబడ్డారు. అనంతరం 1996లో ఆయన గుండెపోటుతో మరణించారు.