Homeఎంటర్టైన్మెంట్Youtuber Shreya: ప్రముఖ యూట్యూబర్ శ్రియా మురళీధర్ హఠాన్మరణం...

Youtuber Shreya: ప్రముఖ యూట్యూబర్ శ్రియా మురళీధర్ హఠాన్మరణం…

Youtuber Shreya: హైదరాబాద్ నగరానికి చెందిన యంగ్ యూట్యూబర్ శ్రియా మురళీధర్ మరణించారు. 27 సంవత్సరాల శ్రియా సోమవారం రాత్రి కార్డియాక్ అరెస్ట్‌తో మృతిచెందినట్లు ఆమే కుటుంబసభ్యులు వెల్లడించారు. హైదరాబాద్‌లోని ల‌క్డిక‌పూల్‌ ఏరియా లో ఉండే ఈమెకు నటన అంటే ఆమెకు ప్రాణం. అందుకని, ఆరోగ్య పరంగా తనకు ఎన్ని అవరోధాలు ఉన్నా… వాటిని దాటుకుని నటించడం మొదలు పెట్టారు. ఈ మేరకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకొని యాంకర్ గా, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్స‌ర్‌ గా ఎదిగారు. అలానే టీవీ హోస్ట్ గా కూడా వ్యవహరించింది శ్రియా. యాంకర్ ప్రదీప్ మాచిరాజు ‘పెళ్లి చూపులు’ రియాలిటీ షోలో శ్రియ ఓ కంటెస్టెంట్ గా కూడా పాల్గొని తనదైన శైలిలో ఆడియన్స్ మన్ననలను పొందింది. ఆ తర్వాత పలు షార్ట్ ఫిల్మ్స్‌లో కూడా శ్రియా నటించారు. “బ్యూటీ అండ్ ద బాస్” సీజన్ 2లో ఆమె ఓ పాత్ర చేశారు. ‘వాట్ ద ఫన్’ యూట్యూబ్ ఛాన‌ల్‌లో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు.

Youtuber Shreya
young youtuber shriya muralidhar dies due to cardiac arrest

Also Read: అరెరే.. ‘పుష్ప’లో ఆ కళ మిస్ అయిందే !

చిన్న వయసులో కార్డియాక్ అరెస్ట్‌కు గురై ప్రాణాలు కోల్పోతుందని ఎవరూ ఊహించలేదు అంటూ ఆమె సన్నిహితులు చెబుతూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. శ్రియ హఠాన్మరణంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. శ్రియా మురళీధర్ మృతి పట్ల బిగ్ బాస్ ఫేమ్, యూట్యూబర్ దీప్తీ సునయన, నటి సురేఖ వాణి కుమార్తె సుప్రియ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత శివ చెర్రీ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. కార్డియాక్ అరెస్ట్‌ రావడానికి వయసుతో సంబంధం లేదని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని, అందరూ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు వైద్యులు సూచిస్తున్నారు.

Also Read: త్రివిక్రమ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నటి నిత్యా మీనన్…

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version