Tamil Actress Deepa: సినిమా అనే రంగుల ప్రపంచంలో చీకటి కోణాలెన్నో ఉంటాయి. తారలుగా వెలిగిపోవాలనే కలలతో ఇండస్ట్రీకి వచ్చే అనేక మంది అమ్మాయిల జీవితాలు దుర్భరంగా ముగుస్తాయి. చాలా తక్కువ మంది మాత్రమే అన్ని అవరోధాలు దాటి తమ లక్ష్యం చేరుకుంటారు. స్టార్ హీరోయిన్ కావాలంటే తాటికాయంత టాలెంట్ తో పాటు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. ఇక పరిశ్రమలో ఎదిగే క్రమంలో పరిచయాలు, ప్రేమలు, మోసాలు, వేధింపులు, ఎడబాట్లు ఇలా ఎన్నో ఎదురవుతాయి. కాగా కోలీవుడ్ కి చెందిన ఓ యువ నటి జీవితం విషాదాంతం అయ్యింది.

కోలీవుడ్ నటి దీప ఆత్మహత్య చేసుకున్నారు. దీప అలియాస్ పౌలిన్ తమిళ చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. ఆమె చెన్నై నగరంలో విరుగంబాక్కం ఏరియాలో గల మల్లికై అపార్ట్మెంట్స్ లో నివాసం ఉంటున్నారు. ఒంటరిగా ఉంటున్న దీప సెప్టెంబర్ 17 శనివారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. దీపతో మాట్లాడాలని కుటుంబ సభ్యులు పలుమార్లు ఫోన్ చేశారు. ఆమె స్పందించకపోవడంతో దీప మిత్రుడు ఇంటికెళ్లి చూశారు. గదిలో దీప ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించారు. షాక్ గురైన దీప మిత్రుడు పోలీసులకు సమాచారం అందించారు.
దీప గదిని పరిశీలించిన పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ నోట్ లో దీప ఆసక్తికర విషయాలు పొందుపరిచారు. ‘నేను తనని జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను. ఇక నా చావుకు ఎవరూ కారణం కాదు..’ అని పేర్కొన్నారు. దీప ఆత్మ హత్యకు లవ్ ఫెయిల్యూరే కారణమని భావిస్తున్న తరుణంలో సూసైడ్ నోట్ అనుమానాలు బలపడేలా చేస్తుంది. తాను ప్రేమిస్తున్న ఆ వ్యక్తి పేరు మాత్రం ఆమె పొందుపరచలేదు.

కొద్దిరోజులుగా దీప ఒంటరిగా ఉంటున్నట్లు సమాచారం. ఆమె ఒత్తిడి ఫీల్ అవుతున్నారని, డిప్రెషన్ కి గురయ్యారని సన్నిహితులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కి పంపారు. సూసైడ్ నోట్ ఆధారంగా విచారణ చేపట్టారు. నటిగా ఎంతో భవిష్యత్తు ఉన్న దీప జీవితం విషాదంగా ముగియడంతో పరిశ్రమ వర్గాలు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.
[…] […]