Ravi Teja: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ లు ఉన్నవారికే ఎక్కువ క్రేజ్ ఉంటుం. ప్రస్తుతం ఇండస్ట్రీలో పెను ప్రభంజనాలను సృష్టిస్తున్న స్టార్ హీరోలు కొంతమంది మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళు సైతం స్టార్లుగా ఎలివేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట కూడా గొప్ప విజయాలను సంపాదించడానికి ఆయా హీరోలు ఎలాంటి కసరత్తు చేస్తున్నారు అనేది కీలకమైన అంశంగా మారింది. రవితేజ లాంటి నటుడు ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలేవీ ప్రేక్షకులను అలరించడం లేదు. కారణం ఏంటి అంటే ఆయన సినిమాలో కొత్తదనం లోపిస్తోంది. అందువల్లే ఆయన సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కడం లేదు. ఇక ఇప్పుడు ఆయన పొజిషన్ మీద కన్నేసిన కొంతమంది హీరోలు ఆయన ప్లేస్ ని రీప్లేస్ చేయాలనే ప్రయత్నం లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అందులో ముఖ్యంగా సిద్దు జొన్నలగడ్డ, నవీన్ పోలిశెట్టి లాంటి నటులు ఉండడం విశేషం. వీళ్ళు వరుసగా మంచి సినిమాలను చేస్తూ ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణను సంపాదించుకుంటున్నారు. దానివల్ల ప్రతి ఒక్క ఆడియన్ కూడా వాళ్ళ సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు…
ఇక రవితేజ ఎలాంటి సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తారో వీళ్ళు కూడా అదే రూట్లో నడుస్తుండడం వల్ల రవితేజ మిస్ చేసుకున్న సక్సెస్ లను వీళ్ళు దక్కించుకుంటున్నారు. తద్వారా తొందర్లోనే వీళ్ళు రవితేజ ప్లేస్ ని ఆక్యుపై చేసే అవకాశం కూడా ఉందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…
ఇకమీదట రాబోయే రోజుల్లో రవితేజ మంచి విజయాలను సాధిస్తే పర్లేదు కానీ లేకపోతే మాత్రం ఆయన కెరీర్ ప్రమాదంలో పడిపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికే యంగ్ హీరోలు రవితేజ కి పోటీగా రావడంతో ఆ వీళ్ళ మధ్య పోటీ తీవ్ర తరం అవుతోంది. రవితేజ కి వరుసగా సినిమాలు చేసే అవకాశం వచ్చినప్పటికి కథల విషయంలోనే ఆయన ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాలి.
అలా చేస్తే తన కెరియర్ మరో 10 సంవత్సరాల పాటు సాఫీగా కొనసాగుతుందని పలువురు సినిమా మేధావులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. చూడాలి మరి రవితేజ నెక్స్ట్ సినిమాలతో సక్సెస్ ని సాధిస్తాడా లేదంటే వాటితో కూడా భారీ డిజాస్టర్ లను మూటగట్టుకుంటాడా అనేది…