Peddi Movie Shooting: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Gobal Star Ram Charan) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పెద్ది'(Peddi Movie) మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం శ్రీలంక లో గ్యాప్ లేకుండా నిన్న మొన్నటి వరకు జరిగింది.. అతి త్వరలోనే ఈ సినిమా నుండి ‘చికిరి’ అనే లిరికల్ వీడియో సాంగ్ విడుదల కాబోతోంది. ఈ పాట కోసం మెగా ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇది AR రెహమాన్, రామ్ చరణ్ కాంబినేషపన్ లో వస్తున్న మొదటి సినిమా కాబట్టి. పైగా డైరెక్టర్ బుచ్చి బాబు కి మంచి మ్యూజిక్ టేస్ట్ కూడా ఉంది. ఈ పాట రిలీజ్ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న రామ్ చరణ్ ఫ్యాన్స్ కి సోషల్ లో నేడు ప్రచారం లో ఉన్న ఒక రూమర్ షాక్ కి గురి చేస్తోంది.
Also Read: రాజమౌళి అంత లేదా? బాహుబలి ఎటర్నల్ వార్ టీజర్ లో ఆ డోస్ కనిపించలేదే..?
వివరాల్లోకి వెళ్తే శ్రీలంక లో భారీ షెడ్యూల్ ని జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్, గత రెండు రోజుల నుండి ఆగిపోయింది అట. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారిన అంశం. అలా ఆగిపోవడానికి కారణం డైరెక్టర్ బుచ్చి బాబు, జాన్వీ కపూర్ మధ్య ఏర్పడిన గొడవలే అని తెలుస్తోంది. శ్రీలంక షెడ్యూల్ లో రీసెంట్ గానే అడుగుపెట్టిన జాన్వీ కపూర్ పై డైరెక్టర్ బుచ్చి బాబు కొన్ని కీలక సన్నివేశాలను తెరకేక్కిస్తున్నాడట. ఇక్కడే వీళ్ళ మధ్య ఎదో సంభాషణ జరిగి అది గొడవలకు దారి తీసిందని, జాన్వీ కపూర్ అలిగి సెట్స్ నుండి వాకౌట్ అయ్యిందనే రూమర్ ప్రచారం లో ఉంది.
ఇందులో ఎంత మాత్రం నిజముందో తెలియదు కానీ, విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే, గత రెండు రోజులుగా సినిమా షూటింగ్ ఆగిపోయింది అనేది వాస్తవం. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ముందుగా అనుకున్న డేట్ మార్చ్ 27,2026 లో విడుదల అవ్వడం దాదాపుగా అసాధ్యామనే అంటున్నారు. ఎందుకంటే షూటింగ్ ఇంకా 40 శాతం కి పైగా బ్యాలన్స్ ఉందట. అనుకున్న టైం లో షూటింగ్ అయ్యి, అవుట్ పుట్ పైన డైరెక్టర్ కి నమ్మకం కలిగితే ఈ చిత్రం అనుకున్న డేట్ కి వచ్చేస్తుంది. లేదంటే వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతోంది అనేది.