Young Heroes Producers: ఒక సినిమా సక్సెస్ లో హీరోలు కీలక పాత్ర పోషిస్తారు. దర్శకుడు సినిమాని ముందుండి నడిపించినప్పటికి హీరోను చూసి మాత్రమే ప్రేక్షకులు థియేటర్ కి వస్తారు. కాబట్టి సినిమాలో హీరో ఎవరు అనేది కీలక పాత్ర వహిస్తోంది. ఇక తనను బట్టే సినిమాకు ఓపెనింగ్స్ వస్తాయి. అలాగే ఆ సినిమా సక్సెస్ఫుల్ టాక్ ను సంపాదించుకుంటే ప్రేక్షకులు రిపీటెడ్ గా సినిమాని చూసే అవకాశాలు కూడా ఉంటాయి… ఇక కొంతమంది స్టార్ హీరోలు ప్రొడ్యూసర్లు గా మారి తమదైన రీతిలో సత్తా చాటుతున్నారు. హీరోగా తనను తాను ఎలివేట్ చేసుకోవడమే కాకుండా ప్రొడ్యూసర్ గా మారి వరుసగా సక్సెస్ లను సాధిస్తూ ఉండడం విశేషం…
ఇక ఆయన ప్రొడక్షన్ హౌస్ నుంచి ఆ, హిట్ సిరీస్, కోర్ట్ మూవీ లాంటివి వచ్చాయి. అన్ని సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించడంతో నాని స్టార్ ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు… ఇక మలయాళం లో స్టార్ హీరో అయిన దుల్కర్ సల్మాన్ సైతం రీసెంట్ ‘కొత్తలోక్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 50 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా దాదాపు 350 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టింది. మలయాళం ఇండస్ట్రీలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
మొత్తానికైతే ఈ సినిమాతో హీరో గానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా దుల్కర్ సల్మాన్ తన సత్తా చాటుకున్నాడు… ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో నటుడిగా మంచి పేరు సంపాదించుకున్న శివ కార్తికేయన్ సైతం హౌస్ మేట్స్ సినిమాతో ప్రొడ్యూసర్ గా మారి మంచి విజయాన్ని అందుకున్నాడు…
ఇలా యంగ్ హీరోలందరు వరుసగా ప్రొడ్యూసర్లుగా మరి కొత్త దర్శకులకు అవకాశాలను ఇస్తూ మంచి కాన్సెప్ట్ లను ప్రేక్షకులకు ముందుకు తీసుకొస్తున్నారు. దీనివల్ల యాంగ్ డైరెక్టర్స్ ఇండస్ట్రీకి పరిచయం అవ్వడమే కాకుండా మంచి స్టోరీలు వస్తున్నాయి. అలాగే ప్రొడ్యూసర్లుగా కూడా వాళ్లు తమ సత్తా చాటుకుంటున్నారు…ఇక ఫ్యూచర్ లో కూడా వీళ్లు మరిన్ని సినిమాలను ప్రొడ్యూస్ చేయాలని తద్వారా సూపర్ సక్సెస్ లను సాధించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు…