Dhanush: సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ను క్రియేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తుంటారు. ఇక ఇలాంటి సందర్భంలోనే ఇకమీదట కూడా వాళ్ళు చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక ఇదిలా ఉంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో వైవిద్య భరితమైన కథాంశాలతో సినిమాలను చేసి సూపర్ సక్సెస్ సాధించిన హీరోలలో ధనుష్ మొదటి స్థానంలో ఉంటాడు… ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టాయి. ఆయన నటుడి గానే కాకుండా దర్శకుడిగా కూడా రాణించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే రాయన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. ఇక రీసెంట్ గా ఇడ్లీ కొట్టు సినిమాతో ప్రేక్షకులను అలరించాలనే ప్రయత్నం చేశాడు. కానీ ఈ సినిమా కూడా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఆయన కొంతవరకు డీలా పడ్డాడు.
ఇక ఇదంతా చూస్తున్న అతని అభిమానులు ధనుష్ నటుడిగా రాణిస్తే సరిపోతోంది. దర్శకుడిగా సినిమాలు చేయాల్సిన పనిలేదు అంటూ ధనుష్ డైరెక్షన్ మీద కొంత వరకు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏంటి అంటే వరుసగా డైరెక్షన్ చేస్తున్న సినిమాలు ప్లాప్ అవుతున్నప్పటికి ఆయన డైరెక్షన్ చేయాలనే కోరికను మాత్రం చంపేసుకోవడం లేదు.
కారణం ఏదైనా కూడా ఆయన హీరోగా చా బిజీగా ఉన్నప్పుడు డైరెక్షన్ మీద సమయాన్ని కేటాయించడం కరెక్ట్ కాదు. హీరోగానే మంచి కాన్సెప్ట్ లతో సినిమాలను చేస్తే సరిపోతుంది. అలా కాకుండా దర్శకత్వం చేయాలనే ఒక కోరికతో సినిమాలను చేసి అతని డేట్స్ ని వేస్ట్ చేస్తున్నాడు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తుండటం విశేషం…
ప్రస్తుతం ఉన్న హీరోలందరిలో ధనుష్ కి చాలా మంచి గుర్తింపు ఉంది. ఎందుకంటే డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు చేయగలిగే కెపాసిటీ ఉన్నటువంటి నటుల్లో తను మొదటి స్థానం లో ఉంటాడు. ఒక కొంత మంది దర్శకులైతే ధనుష్ కోసమే కథలను రాస్తున్నారు. ఇక ఇప్పటికైనా ధనుష్ మంచి సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను సాధిస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…