నట సింహం అని ‘బాలయ్య బాబు’కి బిరుదు అయితే మిగిలిపోయింది గానీ, బాలయ్య నటనను ఇష్టపడేవారు మాత్రం రోజురోజుకూ తగ్గిపోతున్నారు. దీనికితోడు, బాలయ్య అభిమానులు కూడా బాలయ్య సినిమాల పై అంచనాలు పెట్టుకోవడం ఎప్పుడో మానేశారు. లేకపోతే బోయపాటి – బాలయ్య కాంబినేషన్ కి క్రేజ్ ఉన్నా వ్యూస్ రాకపోవడం ఏమిటి ? ఈ సినిమా టీజర్ ఇప్పటికే రిలీజ్ అయింది. అయినా ఒక మీడియమ్ రేంజ్ హీరో సినిమా టీజర్ లానే బాలయ్య సినిమా టీజర్ నిలిచింది.
ఇక బాలయ్య సినిమాలో ఒక కీలక పాత్ర ఉంది. ఆ పాత్ర కోసం ఒక యంగ్ హీరోని తీసుకోవాలని ఎప్పటినుండో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నవీన్ పోలిశెట్టి నుండి కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ వరకూ చాల మంది పేర్లు వినిపించాయి. ఆ హీరో ఈ హీరో నటించబోతున్నాడంటూ రూమర్స్ కూడా బాగా వినిపించాయి. కానీ, చివరకు ఏ హీరో బాలయ్య సినిమాలో నటించడానికి అంగీకరించలేదు.
అయితే ఇంటర్వెల్ లో వచ్చే ఈ పోలీస్ ఆఫీసర్ పాత్ర సినిమాకే కీలకం అని తెలుస్తోంది. కేవలం రెండు సీన్స్ లో మాత్రమే సినిమాలో కనిపించినా.. కథను మలుపు తిప్పే పాత్ర అట. ఇది మూగ – చెమిటి పాత్ర అని.. నలభై నిమషాల పాటు సాగే ఈ కీలక పాత్రలో క్రేజీ హీరో నాగశౌర్య నటించబోతున్నాడని ఓ వార్త బాగా వైరల్ అయింది. కానీ ఆ తరువాత ఈ న్యూస్ పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సహజంగా బాలయ్య సినిమాలో బాలయ్య ఒక్కరే హైలైట్ అవుతాడు కాబట్టి.. ఏ హీరో ఒప్పుకోవడం లేదేమో.
కాగా నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అలాగే తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. బాలయ్యకు ‘సింహ’ ‘లెజెండ్’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి, ఈ సారి ఆ సినిమాలను మించిన హిట్ పడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Young heroes are far away from balayya cinema
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com