పుష్ప సినిమాలో కనుమరుగైన యంగ్ హీరో

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ప్రతిష్టాత్మకంగా తీస్తున్న మూవీ పుష్ప. ఈ మూవీలో ఇప్పటికే ఎంతో మంది విశిష్టమైన వ్యక్తులను ఆర్టిస్టులుగా దర్శకుడు సుకుమార్ తీసుకున్నాడు. అల్లు అర్జున్, రష్మికతోపాటు విలన్ గా మలయాళ నటుడు ఫవాద్ ఫాజిల్ ను తీసుకొని సుకుమార్ ఆశ్చర్యపరిచాడు. మలయాళంలో ఎంతో మార్కెట్ ఉన్న అల్లు అర్జున్ తన ప్రతీ సినిమాలో మలయాళ నటులను ఇంప్లీడ్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఇప్పుడు పుష్ప సినిమాలోనూ మలయాళీ నటులు ఎక్కువ మందియే ఉన్నారట.. తాజాగా […]

Written By: NARESH, Updated On : June 1, 2021 12:19 pm
Follow us on

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ప్రతిష్టాత్మకంగా తీస్తున్న మూవీ పుష్ప. ఈ మూవీలో ఇప్పటికే ఎంతో మంది విశిష్టమైన వ్యక్తులను ఆర్టిస్టులుగా దర్శకుడు సుకుమార్ తీసుకున్నాడు. అల్లు అర్జున్, రష్మికతోపాటు విలన్ గా మలయాళ నటుడు ఫవాద్ ఫాజిల్ ను తీసుకొని సుకుమార్ ఆశ్చర్యపరిచాడు. మలయాళంలో ఎంతో మార్కెట్ ఉన్న అల్లు అర్జున్ తన ప్రతీ సినిమాలో మలయాళ నటులను ఇంప్లీడ్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు.

ఇప్పుడు పుష్ప సినిమాలోనూ మలయాళీ నటులు ఎక్కువ మందియే ఉన్నారట.. తాజాగా తెలుగులో లవర్ బాయ్ హీరోగా ఓ వెలుగు వెలిగి ‘నువ్వే కావాలి’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీలు తీసిన తరుణ్ అలాగే హిట్లు సాధించలేక ప్రస్తుతం టాలీవుడ్ లో తెరమరుగయ్యాడు. సినిమాలు తీయకుండా సైలెంట్ అయ్యాడు. అయితే తాజాగా తరుణ్ ‘పుష్ప’ సినిమా కోసం పనిచేస్తున్నట్టుగా తెలిసింది.

ఇటీవల విడుదలైన ‘ఆహా’ ఓటీటీలో ‘అనుకోని అతిథి’ సినిమాలో నటుడు ఫహాద్ ఫాజిల్ కు తరుణ్ డబ్బింగ్ చెప్పారు. ఆ డబ్బింగ్ చాలా అద్భుతంగా కుదిరిందని టాక్ వచ్చింది. దీంతో పుష్ప సినిమాలోనూ ఫహాద్ ఫాజిల్ లాంటి మంచి నటుడికి ‘తరుణ్’తోనే డబ్బింగ్ చెప్పించాలని డిసైడ్ అయ్యారట.. ఈ మేరకు సుకుమార్ సంప్రదింపులు జరిపినట్టు ఫిలింనగర్ సమాచారం.

ఈ డబ్బింగ్ ఓకే అయితే తరుణ్ ను మరిన్ని పాత్రల్లో చూడడానికి తెలుగు ప్రేక్షకులకు అవకాశం ఉంటుందని.. ఓటీటీల్లోనూ తరుణ్ కు మళ్లీ అవకాశాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.