Telugu Film: అక్కడ ‘ఆర్ఆర్ఆర్’కు గట్టి పోటీస్తున్న మరో తెలుగు సినిమా..!

Telugu film: దర్శకధీరుడు రాజమౌళి తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలిసి నటించిన చిత్రం కావడంతో ఈ మూవీపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కొమురం భీం, అల్లూరి సీతరామరాజు బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ రానుండటంతో ఈ సినిమాపై ఇప్పటికే హైప్ క్రియేట్ అయింది. దీంతో ‘ఆర్ఆర్ఆర్’  కోసం ప్రేక్షకులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. కరోనా కారణంగా వాయిదాలు పడుతున్న ‘ఆర్ఆర్ఆర్’ ఎట్టకేలకు డేట్ ఫిక్స్ […]

Written By: NARESH, Updated On : December 7, 2021 11:49 am
Follow us on

Telugu film: దర్శకధీరుడు రాజమౌళి తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలిసి నటించిన చిత్రం కావడంతో ఈ మూవీపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కొమురం భీం, అల్లూరి సీతరామరాజు బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ రానుండటంతో ఈ సినిమాపై ఇప్పటికే హైప్ క్రియేట్ అయింది. దీంతో ‘ఆర్ఆర్ఆర్’  కోసం ప్రేక్షకులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

Telugu Film

కరోనా కారణంగా వాయిదాలు పడుతున్న ‘ఆర్ఆర్ఆర్’ ఎట్టకేలకు డేట్ ఫిక్స్ చేసుకుంది. సంక్రాంతి కానుకగా ఈమూవీ రాబోతుందని చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఈ మూవీ విడుదలైన వారం గ్యాప్ లోనే మరో తెలుగు మూవీ ప్యాన్ ఇండియా లెవల్లో విడుదలవుతోంది. అదే డార్లింగ్ ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’.

‘బాహుబలి’.. ‘సాహో’ తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న చిత్రం ‘రాధేశ్యామ్’. ఈ మూవీలో ప్రభాస్ కు జోడీగా బుట్టబొమ్మ పూజహెగ్దే నటిస్తుంది. రోమియో, జూలియట్ ప్రేమ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీపై విదేశాల్లో ఎక్కువగా షూటింగ్ చేసుకుంది. ఇటలీ అందాలను దర్శకుడు రాధాకృష్ణ కెమెరాలో బంధించారు. దీంతో ఈ మూవీపై కూడా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్స్ అన్ని కూడా ఆసక్తికరంగా ఉన్నాయి.

ఈ రెండు చిత్రాలు కూడా కేవలం వారం గ్యాప్ లోనే విడుదలవుతున్నాయి. జనవరి 7న ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఆ తర్వాత వారం గ్యాప్ లోనే ‘రాధేశ్యామ్’ రానుంది. ఈ రెండు చిత్రాలు సంక్రాంతిని టార్గెట్ చేయడంతో బాలీవుడ్ నిర్మాతలు తమ సినిమాలు జనవరిలో విడుదల చేసేందుకు జంకుతున్నారు.

‘బాహుబలి’ సిరీసులతో రాజమౌళికి బాలీవుడ్లో హైప్ క్రియేట్ అయింది. దీంతో ఆయన దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కోసం అక్కడి ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అలాగే ప్రభాస్ కు సైతం ‘బాహుబలి’.. ‘సాహో’లతో ఉత్తరాదిన భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో అతడి మూవీ కోసం ఉత్తరాది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

Also Read: బీమ్లా నాయక్ సినిమాలో కామెడీ కింగ్ బ్రహ్మానందం… ఏ పాత్రలో అంటే

అయితే ‘ఆర్ఆర్ఆర్’ కంటే ఉత్తరాదిన ప్రభాస్ మూవీ కోసమే ఫ్యాన్స్ ఎక్కువగా ఎదురుచూస్తున్న ఇటీవల ఓ సర్వేలో వెల్లడికావడం విశేషం. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ మూవీకి మరో తెలుగు మూవీ ‘రాధేశ్యామ్’ గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కన్పిస్తుంది. అయితే కలెక్షన్ల విషయంలో ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కంటే ‘రాధేశ్యామ్’ ఎక్కువ కష్టపడాల్సి ఉంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

ఈ రెండు సినిమాలు బాలీవుడ్లో భారీ విజయం సాధిస్తే తెలుగు సినిమా స్థాయి మరింత పెరగడం ఖాయమని సినీప్రియులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదేకనుక జరిగితే తెలుగులో మరిన్ని ప్యాన్ ఇండియా స్థాయి మూవీలు రావడం ఖాయంగా కన్పిస్తోంది.

Also Read: ఊహకందని రేంజ్​లో ఆర్​ఆర్​ఆర్​ ప్రమోషన్స్​.. గ్రాండ్​గా ట్రైలర్​ రిలీజ్​కు ఏర్పాట్లు