Rajamouli Vs Young Directors: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న దర్శకులకు చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇప్పుడున్న దర్శకులందరిలో రాజమౌళి కి ప్రత్యేకమైన స్థానం ఉంది…తెలుగు సినిమా ఇండస్ట్రీని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన ఘనత కూడా రాజమౌళి కే దక్కుతోంది…ఆయన ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో మొదటి స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా లో తెలుగు సినిమా గౌరవాన్ని నిలబెట్టడమే కాకుండా పాన్ వరల్డ్ లోకి మన స్థాయిని పెంచాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే ప్రస్తుతం ఆయన మహేష్ బాబు తో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం ఉండేలా తీర్చిదిద్దుతూ ఉంటాడు. అందువల్లే ఆయనకు గొప్ప క్రేజ్ వచ్చింది. ఇప్పటివరకు ఆయనను ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఢీకొట్టగలిగే దర్శకుడు ఎవరు కనిపించడం లేదు. ఒకవేళ రాజమౌళి ఢీకొట్టాలంటే మాత్రం ఆ దర్శకుడిలో చాలా క్వాలిటీస్ ఉండాలి… ముఖ్యంగా రాజమౌళి పని రాక్షసుడిలా పనిచేస్తూనే ఉంటాడు. ఎప్పుడు ఏదో ఒక పనిలో నిమగ్నమైపోతూ ఉంటాడు. అందుకే ఆయనకు సక్సెస్ లు చాలా ఎక్కువగా ఉన్నాయనే చెప్పాలి.
ఇప్పటికి తన సినిమాకు సంబంధించిన ప్రతి పనిని తనే దగ్గరుండి చూసుకుంటాడు. సినిమా అంటే ఆయనకి ఎంత ఇష్టమో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి పని చేసేవాళ్లు ఉంటే రాజమౌళి ఢీ కొట్టడం చాలా ఈజీ…అలాగే ప్రతి సీన్ కూడా ఆర్టిస్టులకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎలా చేయాలి? ఏ మేరకు నటించాలి. ఎంతవరకు మన క్యారెక్టరైజేషన్ ఉండాలి అనేది మొత్తం రాజమౌళినే చేసుకుంటాడు.
అలాంటి రాజమౌళి 50 సంవత్సరాలు పైబడిన వయసులో కూడా ఇంతటి గొప్ప సినిమాలు చేయగలుగుతున్నాడు అంటే నిజంగా ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే…ఇక ఇప్పుడు వస్తున్న యాంగ్ జనరేషన్ కి రాజమౌళి ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి అంటే కష్టపడుతూ పనిచేసిన ప్రతి ఒక్కరికి ఏదో ఒకరోజు సక్సెస్ వస్తుంది…
అలా కష్టపడితే ప్రతి ఒక్కరు రాజమౌళి ని బీట్ చేయవచ్చు అంటూ తనను బీట్ చేయడానికి కొత్తగా వచ్చే దర్శకులకు ఆయన ఒక సలహా అయితే ఇచ్చారు. మనం రోజు ఎంతవరకు కష్టపడుతున్నాం అనేది పక్కన పెడితే సినిమా సక్సెస్ అయ్యేంతవరకు మన కష్టం ఆగకూడదు. అప్పుడే మనకు భారీ సక్సెసు లు వస్తాయని ఆయన చెప్పడం విశేషం…