AUS Vs IND: ఈనెల 19 నుంచి టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఆస్ట్రేలియా జట్టుతో మూడు వన్డేల సిరీస్ ఆడబోతోంది. ఈ సిరీస్లో టీమిండియా కు గిల్ నాయకత్వం వహించబోతున్నాడు. సారధిగా అతడికి తొలి వన్డే సిరీస్ ఇది. ఇటీవల టెస్ట్ క్రికెట్ సారధిగా అతడు తన బాధ్యతలను స్వీకరించాడు. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్లో తాను ఏమిటో నిరూపించుకున్నాడు. వెస్టిండీస్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్ చేయడం లో తనవంతు పాత్ర పోషించాడు. అంతేకాదు సారధిగా తొలి టెస్ట్ సిరీస్ విజయాన్ని అందుకున్నాడు.
ఇప్పుడు ఇక టీమిండియా ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లిపోతుంది. అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియా తో మూడు వన్డేల సిరీస్ ఆడుతుంది. తొలి మ్యాచ్ పెర్త్ వేదికగా మొదలవుతుంది. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా తర్వాత స్థానంలో కొనసాగుతోంది. ఇటీవల కాలంలో ఛాంపియన్స్ ట్రోఫీ జరిగినప్పుడు టీమ్ ఇండియా అదరగొట్టింది. బలమైన ఆస్ట్రేలియాను నేల నాకించింది. ఈ నేపథ్యంలోనే జరిగే ఈ వన్డే సిరీస్ హోరాహోరీగా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. రెండు జట్లలో కూడా అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. అందువల్లే అభిమానులకు అద్భుతమైన క్రికెట్ మజా లభిస్తుందని అంచనాలు వినిపిస్తున్నాయి.
ఈ మూడు వన్డేల సిరీస్ ప్రారంభానికి ముందు ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టుకు షాక్ తగిలింది. ఎందుకంటే ఆస్ట్రేలియా జట్టులో కీలక ఆటగాళ్లు అయిన ఆడం జంప, జోష్ ఇంగ్లీస్ తొలి వన్డే కు దూరమయ్యారు. జంప రెండవసారి తండ్రి అయ్యాడు. దీంతో తన భార్యతోనే ఉండాలని అతడు నిర్ణయించుకున్నాడు. మరోవైపు ఇంగ్లీస్ కండరాల నొప్పితో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడు రెండు, 3 వన్డేలకు జట్టులోకి ప్రవేశిస్తాడు.. వీరిద్దరి స్థానాలను మాథ్యూ కుహ్నెమన్ , జస్ట్ ఫిలిప్ తో సెలక్టర్లు భర్తీ చేశారు. ఫిలిప్ వికెట్ కీపర్ , బ్యాటర్.. దీంతో అతడు తొలి వన్డే లో తన సత్తా చూపించడానికి సిద్ధమవుతున్నాడు. సూపర్ ఫామ్ లో ఉన్న ఇంగ్లీస్ తొలి వన్డే కు దూరం కావడం జట్టుకు కాస్త ఇబ్బందేనని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇటీవల సిరీస్లలో ఇంగ్లిస్ అదరగొట్టాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మైదానంలో పరుగుల వరద పారించాడు. జట్టులో మిగతా ప్లేయర్లు విఫలమైనప్పటికీ అతడు ఒక్కడే నిలబడ్డాడు. స్ఫూర్తిదాయకమైన ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన సిరీస్లో సత్తా చూపించాడు ఇంగ్లిస్. అయితే అతడు తొలి వన్డే కు దూరం కావడం జట్టుకు కాస్త ఇబ్బందేనని.. అయితే అతడి స్థానంలో వచ్చిన ఆటగాడు సత్తా చూపిస్తే మాత్రం ఆస్ట్రేలియాకు తిరుగు ఉండదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.