SKN Rumors: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’. ‘క’ చిత్రం తో భారీ కమర్షియల్ సక్సెస్ ని అందుకొని కం బ్యాక్ ఇచ్చిన కిరణ్ సబ్బవరం, రీసెంట్ ‘K ర్యాంప్’ మూవీ తో మరో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. ఈ చిత్రం విడుదలకు ముందే ‘చెన్నై లవ్ స్టోరీ’ నుండి ఒక గ్లింప్స్ వీడియో విడుదలై మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఈ నెల 24 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రొమోషన్స్ ని భారీ లెవెల్ లో ప్లాన్ చేశారు మేకర్స్. ఈ చిత్రం లో శ్రీ గౌరీ ప్రియా హీరోయిన్ గా నటించగా , SKN నిర్మాతగా వ్యవహరించారు. ఆయనతో పాటు బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ కూడా ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు.
రవి నంబూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, మణిశర్మ సంగీత దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రొమోషన్స్ లో భాగంగా హీరో కిరణ్ అబ్బవరం , గౌరీ ప్రియా , SKN ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ లో SKN పై శ్రీ గౌరీ ప్రియా చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ముందుగా యాంకర్ SKN ని ఒక ప్రశ్న అడుగుతూ ‘ మీరు మీ టీం లో ఎవరిమీదైనా గాసిప్ చెయ్యాలంటే ఏమి చేస్తారు?’ అని అడగ్గా, అందుకు SKN సమాధానం చెప్తూ ‘మా హీరోయిన్ తెలుగు సినిమాలకంటే ఎక్కువగా తమిళ సినిమాలకే ప్రాధాన్యత ఇస్తుంది. ఇక్కడ అసలు సినిమాలు చేయడం లేదు. ఈ సినిమాకు కూడా చెన్నై లవ్ స్టోరీ అని చెప్పగానే , అవునా అయితే కచ్చితంగా చేస్తాను సార్ అని ఒప్పుకుంది’ అంటూ చెప్పుకొచ్చారు.
ఇక యాంకర్ హీరో గౌరీ ప్రియా ని ‘మీ నిర్మాత SKN పై ఎలాంటి గాసిప్స్ క్రియేట్ చేస్తారు?’ అని అడగ్గా, అందుకు ఆమె సమాధానం చెప్తూ ‘మా నిర్మాత హీరోయిన్స్ పై రూమర్స్ ఎక్కువ క్రియేట్ చేస్తారు. ఇప్పుడే నా మీద ఆయన క్రియేట్ చేసిన రూమర్స్ మీరు చూశారు ‘ అంటూ ఫన్నీ కౌంటర్ ఇచ్చింది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ ఇంటర్వ్యూ ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
