https://oktelugu.com/

2018 Moive : 2018′ చిత్రాన్ని తెలుగు లో మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఈ రెండు కోట్ల రూపాయిలను  మూడు రోజుల్లోనే వసూలు చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు, ఫుల్ రన్ లో కనీసం 5 కోట్ల రూపాయిల షేర్ రాబడుతుందని అంచనా.

Written By:
  • Vicky
  • , Updated On : May 28, 2023 / 08:18 AM IST
    Follow us on

    2018 Moive : మలయాళం సినిమా ఇండస్ట్రీ సంచలనం గా మారిన లేటెస్ట్ చిత్రం ‘2018’. తొనివో థామస్ హీరో గా నటించిన ఈ సినిమా మలయాళం లో 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన మొట్టమొదటి సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించింది. మలయాళం సినిమా ఇండస్ట్రీ నుండి అంత మొత్తం లో వసూళ్లు రావడం అంటే సాధారణమైన విషయం కాదు.ఎందుకంటే టాలీవుడ్, బాలీవుడ్ మరియు కోలీవుడ్ ఇండస్ట్రీ తో పోలిస్తే చాలా చిన్న ఇండస్ట్రీ.

    అక్కడ వంద కోట్ల రూపాయిల గ్రాస్ వస్తేనే బాహుబలి సినిమాని ట్రీట్ చేసినట్టు చేస్తారు, అలాంటిది 150 కోట్ల రూపాయిల రేంజ్ లో వసూళ్లను రాబట్టింది అంటే ఇక వాళ్లకి ఎంత హై వచ్చి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటీకీ ఈ సినిమా ఫుల్ రన్ ఆగలేదు, సగటున రోజుకి నాలుగు కోట్ల రూపాయిల రేంజ్ వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది.

    రీసెంట్ గానే ఈ చిత్రాన్ని తెలుగు లో కూడా రిలీజ్ చేసారు, మలయాళం లో ఎలాంటి రెస్పాన్స్ అయితే వచ్చిందో తెలుగు లో కూడా అదే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ కలెక్షన్స్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. అయితే ఈ సినిమాని ముందుకు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ రీమేక్ చేద్దామని అనుకున్నాడట, అందుకోసం ప్రముఖ హీరో శర్వానంద్ ని కూడా సంప్రదించినట్టు సమాచారం. ఆయన ఈ చిత్రం లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు.

    ఇక రీమేక్ రైట్స్ కోసం ‘2018’ నిర్మాతల వద్దకు వెళ్లగా, వాళ్ళు రీమేక్ రైట్స్ ఎవరికీ అమ్మే ఛాన్స్ లేదని అన్నారట. దాంతో ఇక చేసేది ఏమి లేక తెలుగు డబ్బింగ్ రైట్స్ ని కొనుగోలు చేసి రీసెంట్ గానే విడుదల చేసారు. డబ్బింగ్ ఖర్చులు మరియు ప్రమోషన్ కాస్ట్ మొత్తం కలిపి రెండు కోట్ల రూపాయిలు అయ్యిందట. ఈ రెండు కోట్ల రూపాయిలను  మూడు రోజుల్లోనే వసూలు చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు, ఫుల్ రన్ లో కనీసం 5 కోట్ల రూపాయిల షేర్ రాబడుతుందని అంచనా.