https://oktelugu.com/

Tiger Nageshwar Rao : 1000 కోట్లపై కన్నేసిన రవితేజ..’టైగర్ నాగేశ్వర రావు’ చిత్రం లో అలాంటి సన్నివేశాలు ఉన్నాయా!

అంత అద్భుతంగా ఆయన పాత్ర ఇందులో ఉంటుంది' అంటూ చెప్పుకొచ్చాడు.ఆయన మాట్లాడిన మాటల్లోని నమ్మకాన్ని చూసి ఫ్యాన్స్ లో కూడా సరికొత్త ఆశలు చిగురించాయి.అక్టోబర్ లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించబోతుందో చూడాలి.

Written By:
  • Vicky
  • , Updated On : May 28, 2023 / 08:09 AM IST
    Follow us on

    Tiger Nageshwar Rao : మాస్ మహారాజ రవితేజ తన కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న చిత్రం ‘టైగర్ నాగేశ్వర రావు’.రీసెంట్ గానే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ గ్లిమ్స్ వీడియో కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి సెన్సషనల్ రెస్పాన్స్ వచ్చింది.’జింకను వేటాడే పులి ని చూసి ఉంటావ్.. పులిని వేటాడే పులిని ఎప్పుడైనా చూసావా’ అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ కి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది.

    పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అవుతున్న సినిమా కాబట్టి, ఈ గ్లిమ్స్ వీడియో కి వాయిస్ ఓవర్ తెలుగు లో విక్టరీ వెంకటేష్ ఇవ్వగా, హిందీ లో జాన్ అబ్రహం, తమిళం లో కార్తీ మరియు మలయాళం లో దుల్కర్ సాల్మన్ ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ లోని స్టువర్ట్ పురం లో ఉన్నటువంటి టైగర్ నాగేశ్వర రావు అనే దొంగ నిజ జీవితాన్ని ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ వంశీ.

    ఇక ఈ చిత్రం లో హీరోయిన్ గా ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ చెల్లెలు నిపుర్ సనన్ నటిస్తుండగా, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఒక పవర్ ఫుల్ పాత్రని పోషిస్తుంది.ఇక ఈ సినిమా గురించి నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ ‘ఒక సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై 1000 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టాలంటే, చరిత్ర లో ఇప్పటి వరకు చూడనటువంటి సన్నివేశాలు ఉండాలి. అలాంటి సన్నివేశాలు మా చిత్రం లో బోలెడన్ని ఉన్నాయి. ఆడియన్స్ కచ్చితంగా థ్రిల్ కి ఫీల్ అవుతారు.ఇన్నాళ్లు మీరందరు చూసిన రవితేజ వేరు, టైగర్ నాగేశ్వర రావు చిత్రం లో కనిపించే రవితేజ వేరు. అంత అద్భుతంగా ఆయన పాత్ర ఇందులో ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.ఆయన మాట్లాడిన మాటల్లోని నమ్మకాన్ని చూసి ఫ్యాన్స్ లో కూడా సరికొత్త ఆశలు చిగురించాయి.అక్టోబర్ లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించబోతుందో చూడాలి.