Mahesh Babu : ముఫాసా’ పాత్రకు డబ్బింగ్ చెప్పినందుకు ‘డిస్నీ’ సంస్థ మహేష్ కి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

డిస్నీ సంస్థ మన ఇండియన్ భాషలకు సంబంధించిన రిలీజ్ కోసం, ఆయా భాషలకు చెందిన ప్రముఖ స్టార్ హీరోలతో 'ముఫాసా' పాత్రకు డబ్బింగ్ చెప్పిస్తున్నారు. బాలీవుడ్ లో 'ముఫాసా' పాత్రకు షారుఖ్ ఖాన్ డబ్బింగ్ చెప్పగా, తెలుగు లో సూపర్ స్టార్ మహేష్ బాబు చెప్పాడు. ఈ సినిమాకి సంబంధించిన తెలుగు ట్రైలర్ నేడు మహేష్ బాబు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా విడుదల చేసాడు.

Written By: Vicky, Updated On : August 26, 2024 7:31 pm

Mahesh Babu

Follow us on

Mahesh Babu :  సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రాండ్ ఇమేజి ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. యూత్ ఆడియన్స్ లో ఆయనకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో ప్రముఖ సంస్థలు మహేష్ బాబు బ్రాండ్ ని ఉపయోగించుకొని తమ ప్రొడక్ట్స్ కి మార్కెట్ లో క్రేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంటాయి. అందుకే ఇప్పటికీ మహేష్ బాబు యాడ్ రంగంలో పోటీ ఇచ్చే హీరోనే లేరు. రెండు దశాబ్దాలుగా ఆయన యాడ్ రంగం లో నెంబర్ 1 గా కొనసాగుతూనే ఉన్నారు. కేవలం మహేష్ బాబు ని యాడ్స్ కోసం మాత్రమే కాదు, కొంతమంది సినీ నటులు తమ సినిమాలకు మహేష్ చేత వాయిస్ ఓవర్ కూడా ఇప్పించుకుంటారు. ఇప్పటి వరకు ఆయన జల్సా, బాద్ షా, ఆచార్య వంటి సినిమాలకు వాయిస్ ఓవర్ అందించాడు.

ఇప్పుడు మహేష్ వాయిస్ కోసం హాలీవుడ్ లో ప్రఖ్యాత నిర్మాణ సంస్థలలో ఒకటైన ‘డిస్నీ’ కూడా దిగొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు మొత్తం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న ‘ముఫాసా: ది లయన్ కింగ్’ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 20 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా డిస్నీ సంస్థ మన ఇండియన్ భాషలకు సంబంధించిన రిలీజ్ కోసం, ఆయా భాషలకు చెందిన ప్రముఖ స్టార్ హీరోలతో ‘ముఫాసా’ పాత్రకు డబ్బింగ్ చెప్పిస్తున్నారు. బాలీవుడ్ లో ‘ముఫాసా’ పాత్రకు షారుఖ్ ఖాన్ డబ్బింగ్ చెప్పగా, తెలుగు లో సూపర్ స్టార్ మహేష్ బాబు చెప్పాడు. ఈ సినిమాకి సంబంధించిన తెలుగు ట్రైలర్ నేడు మహేష్ బాబు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా విడుదల చేసాడు. ఈ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముందుగా మహేష్ బాబు అభిమానులకు తమ అభిమాన హీరో గాత్రాన్ని విన్నందుకు ఎంతో సంతోషిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే మహేష్ వాయిస్ ఓవర్ కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీ లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమాకి ఆయన డబ్బింగ్ చెప్పినందుకు గాను 12 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకున్నాడట.

వాయిస్ ఓవర్ కి ఈ స్థాయి రెమ్యూనరేషన్ అందుకున్న ఏకైక హీరో గా మహేష్ బాబు చరిత్ర సృష్టించాడు అనే చెప్పొచ్చు. గతంలో ఆయన తెలుగు సినిమాలకు ఇచ్చిన వాయిస్ ఓవర్లు మొత్తం ఆయా హీరోల మీద ఉన్న అభిమానంతో ఉచితంగా చేసినవే. మహేష్ వాయిస్ కి హాలీవుడ్ సంస్థ ఇంత విలువ లెక్కగట్టినా కూడా ఆయన ఉచితంగా గత సినిమాలకు వాయిస్ ఓవర్లు ఇచ్చాడంటే, ఎంత గొప్ప మనసు అనేది అర్థం చేసుకోవాలి. ఇకపోతే మహేష్ బాబు త్వరలోనే రాజమౌళి తో ఒక సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివర్లోనే ఆ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.