Munjya Review : సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తు ఉంటాయి. ఇక ఇలాంటి క్రమం లోనే రెగ్యులర్ సినిమాలే కాకుండా డిఫరెంట్ జానర్స్ లో సినిమాలు రిలీజ్ అవుతూ ప్రేక్షకుల మెప్పు పొందుతున్నారు. ఇక మొత్తానికైతే ఇప్పుడు ఇండస్ట్రీలో వైవిధ్యమైన కథాంశానికి మంచి గిరాకీ పెరుగుతుందనే విషయం రీసెంట్గా వస్తున్న సినిమాలను అబ్జర్వ్ చేస్తే మనకు అర్థం అయిపోతుంది. ఒక డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ముంజ్యా సినిమా రీసెంట్ గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది.ప్రేక్షకులను ఆకట్టుకుందా..?లేదా అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే బిట్టు (అభయ్ వర్మ) హెయిర్ డ్రెస్సర్… అతడిని ఒక కల ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. అదేంటి అంటే ఒక ఊరి మధ్యలో ఒక పెద్ద రావి చెట్టు ఉంటుంది. దాని పైన ఒక అదృశ్యమైన ఆకారం తనని పట్టి పీడుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది…అలాగే తను వాళ్ల ఊరికి వెళ్ళినప్పుడు అతనికి ఒక పెద్ద రావి చెట్టు కనిపిస్తుంది. దాని మీద ఉన్న ఒక బ్రహ్మ రాక్షసుడి వల్లే వాళ్ల నాన్న ప్రాణాలు కోల్పోయాడని తెలుస్తుంది. ఇక దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే డైరెక్టర్ ‘ఆదిత్య సర్పొత్తర్’ తను అనుకున్న పాయింట్ ను చాలా క్లియర్ గా క్లారిటీ గా తెరకెక్కించారు. ఆయన ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా కథ, స్క్రీన్ ప్లే చాలా బాగా రాసుకున్నాడు. ఇక మొత్తానికైతే ఆయన ఈ సినిమాలో ఎమోషన్స్ ను కూడా చాలా పీక్స్ లెవల్లో చూపిస్తూ హ్యాండిల్ చేసిన విధానం చాలా బాగుంది. అలాగే హార్రర్ ఎపిసోడ్స్ కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నాడు. ఇక ఈ సినిమాలో బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఇంతకుముందు వరకు ఇలాంటి సినిమాలు వచ్చినప్పటికీ ఈ సినిమా ఆల్మోస్ట్ చాలా మంచి ఇంపాక్ట్ ను క్రియేట్ చేసి ప్రేక్షకుల్లో ఒక మంచి ఫీల్ ని కూడా క్రియేట్ చేసింది. నిజానికి ఇలాంటి కథ హో సినిమా చేయాలంటే చాలా ఘాట్స్ ఉండాలి.
ఏమాత్రం హర్రర్ ఎలిమెంట్స్ తగ్గిన లేదంటే సినిమాలో ఎమోషన్ పండకపోయినా కూడా సినిమా మొదటికే మోసం వస్తుంది. కనుగొన వాటన్నింటిని అధిగమించబడి సినిమా కోసం పడిన కష్టం మనకు స్క్రీన్ మీద చాలా బాగా కనిపిస్తుంది. ముఖ్యంగా దర్శకుడు చాలా వరకు ఇక స్టోరీలో ఉన్న డీటేలింగ్ కూడా ఎక్స్ట్రాడినరీగా రాసుకున్నాడు. సినిమా స్టార్టింగ్ నుంచి చివరి వరకు ప్రతి ఎలిమెంట్ కి ఇంటర్ లింక్ చేసుకున్న విధానం నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి.
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే అభయ్ వర్మ ఈ సినిమా మొత్తాన్ని ఒక్కడే తన భుజాల మీద మోసుకెళ్లాడనే చెప్పాలి. సినిమా స్టార్ట్ అయిన మొదట్లో కొంచెం స్లో గా అనిపించినప్పటికీ ఇంటర్వెల్ నుంచి కీలకంగా సాగడమే కాకుండా ఒక్కొక్క పాయింట్ లో ఒక్క ఎమోషన్ ని బిల్డ్ చేసుకున్న విధానం కూడా చాలా బాగుంది దాని కోసం చాలా కష్టపడ్డట్టుగా తెలుస్తుంది. నిజంగా ఆయన నటున వల్లే ఈ సినిమా ఇంత బాగా ఎలివేట్ అయిందనే చెప్పాలి. అలాగే శర్వారి కూడా చాలా బాగా యాక్టింగ్ చేసి మెప్పించడమే కాకుండా సినిమా మీద ఆమెకు ఎలాంటి పాషన్ ఉందో కూడా తెలియజేసింది. డైరెక్టర్ ఎలాంటి ఇంటెన్స్ తో అయితే ఆమె పాత్రను క్రియేట్ చేశాడో అందులో ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వకుండా తన నటనతో మెప్పించింది. ప్రేక్షకులందరిని కట్టిపడేసేలా ఆమె మెప్పించిన తీరు నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి…ఇక మిగిలిన ఆర్టిస్టులందరు వాళ్ల పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
టెక్నికల్ అంశాలు…
ఇక టెక్నికల్ అంశాల విషయానికొస్తే ముందుగా మ్యూజిక్ గురించి చెప్పాలి. ఈ సినిమాలో మ్యూజిక్ మాత్రం చాలా చక్కగా కుదిరింది. సినిమా మొత్తానికి అదే ఆయువు పట్టు అనే చెప్పాలి. నిజానికి సినిమాలో హార్రర్ ఎలిమెంట్స్ ఎలివేట్ అవ్వడానికి మ్యూజిక్ చాలా బాగా హెల్ప్ చేసింది. ఇక సినిమాటోగ్రఫి కూడా చాలా కొత్తగా ఉండటమే కాకుండా ప్రతి సీన్ తాలూకు జస్టిఫికేషన్ ఇస్తు సినిమాను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళింది. ముఖ్యంగా కొన్ని సీన్లలో డీటేలింగ్ స్టోరీ టెల్లింగ్ లో సినిమాటోగ్రఫీ చాలా బాగా హెల్ప్ అయింది. ఇక ఎడిటింగ్ కూడా షార్ప్ కట్స్ తో ఉండటం వల్ల సినిమా మీద ఇంకాస్త ఇంట్రెస్ట్ పెరిగింది…
ప్లస్ పాయింట్స్
కథ
స్క్రీన్ ప్లే
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
మైనస్ పాయింట్స్
ఫస్ట్ హాఫ్ కొంచెం సాగదీతాగా ఉంది…
రేటింగ్
ఈ సినిమాకు మేమిచ్చే రేటింగ్ 2.75/5
చివరి లైన్
డిఫరెంట్ సినిమాలు ఇష్టపడేవాళ్ళు ఈ సినిమాను చూడండి చాలా బాగా నచ్చుతుంది…