Posani Krishna Murali: ఈటీవీ 27 ఏళ్ల పండుగకు రంగం సిద్ధమైంది. ఈనెల 28వ తేదీన ఆదివారం రాత్రి 7 గంటలకు ఈ పండుగను నిర్వహించడానికి అన్నీ సిద్ధం చేశారు. ప్రతీ వేడుకను బుల్లితెర నటులు, కమెడియన్స్, సినీ తారలతో కలిసి అంరంగ వైభవంగా ఓ కార్యక్రమాన్ని చేసే ఈటీవీ ఈసారి కూడా అదే పనిచేసింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటులు పోసాని కృష్ణమురళి, నటి ఇంద్రజతోపాటు బుల్లితెర కమెడియన్స్, యాంకర్స్ హైపర్ ఆది, ప్రదీప్, సుడిగాలి సుధీర్ లాంటి వారు కూడా పాల్గొన్నారు.
ఇక మల్లెమాల వైఖరి నచ్చక వెళ్లిపోయిన సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్రలాంటి వారు కూడా ఈటీవీపై ప్రేమతో ఈ 27 ఏళ్ల పండుగ పాలుపంచుకున్నారు. పాతపగలన్నీ మరిచిపోయి ఈ వేడుకకు హాజరు కావడం విశేషం. ‘భలే మంచి రోజు’ అంటూ ఈటీవీ ఒక ప్రత్యేకమైన షోను నిర్వహించింది.
ఇకపోతే ఈ వేడుకలో పోసాని కృష్ణమురళీ, హైపర్ ఆది కామెడీ బాగా పడింది. పోసాని సీరియస్ కామెడీని ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. స్కిట్ చేస్తున్న సమయంలో ఓ అందమైన సీరియల్ యాక్టర్ యమున.. పోసాని వద్దకు వచ్చి ‘తనకో సమస్య వచ్చిందని.. ఈ పిల్లలు మీ పిల్లలే అనుకోండి అని..’ మీరే పరిష్కరించాలని కోరుతుంది. దీనికి పోసాని కల్పించుకొని .. ‘వాళ్లు నా పిల్లలే.. నువ్వు నా భార్య అవుతావ్.. కాబట్టి మనం ఇద్దరం ఈ విషయంపై ఏకాంతంగా మాట్లాడుకుందాం.. పరిష్కరించుకుందాం.. పక్కకు పదా?’ అంటూ సెటైర్ వేస్తాడు. యుమనను పట్టుకొని ‘ఏకంగా తన భార్య’ అంటూ పోసాని చెప్పేయడంతో అక్కడున్న అందరూ పగలబడి నవ్వుతారు. నువ్వే నా భార్య అంటూ పోసాని ఆ సీరియల్ నటితో చేసిన కామెడీ మాత్రం కార్యక్రమంలో హైలెట్ గా నిలిచింది. పోసాని ఓవరాక్షన్ కు సీరియల్ నటి యుమన షాక్ అయిపోయింది. మరీ ఇంతలా ఇన్ వాల్వ్ అయ్యాడేంటి అని నోరెళ్లబెట్టింది.
ఇక హైపర్ ఆది వాట్సాప్ లో అమ్మాయిల కాంటాక్టులే ఎక్కువగా ఉంటాయని ఇంద్రజ, పోసాని ఓ రేంజ్ లో ఆడుకున్నాడు. ఆదికి అమ్మాయిల సోగ్గాడు అంటూ ఆడిపోసుకున్నారు. సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, ప్రదీప్ చేసిన కామెడీ కూడా ఇందులో హైలెట్ గా నిలిచింది. ఈ షో ఈ ఆదివారం ఫుల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఆ ఫుల్ కామెడీకి సంబంధించిన ట్రైలర్ ను కింద చూసి ఎంజాయ్ చేయండి.