Bigg Boss Telugu 8: దోశ విషయంలో కొట్లాడుకున్న నిఖిల్, యష్మీ, ప్రేరణ..రోజురోజుకి దిగజారిపోతున్న కన్నడ బ్యాచ్!

నిన్న చిన్న ఎగ్ దోశ విషయంలో నిఖిల్, ప్రేరణ, యష్మీ మధ్య పెద్ద గొడవ జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే నిఖిల్ ముందుగా ప్రేరణని ఒక ఎగ్ దోశ వేయమని చెప్తాడు. ప్రేరణ హడావడిలో వేయలేకపోతుంది. ఆ తర్వాత యష్మీ వచ్చి నిఖిల్ కోసం ఎగ్ దోశ వేస్తుంది. కానీ ప్రేరణ అడిగినప్పుడు వేయలేదు కాబట్టి నిఖిల్ చాలా యాటిట్యూడ్ చూపిస్తాడు.

Written By: Vicky, Updated On : October 29, 2024 4:14 pm

Bigg Boss Telugu 8

Follow us on

Bigg Boss Telugu 8:  ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో చిన్న విషయాలకు గొడవ పడడం కామన్ అయిపోయింది. చిన్న విషయాలకు గొడవ పడడమే అతి అనుకుంటే దానిని నామినేషన్స్ లోకి తీసుకొచ్చి రచ్చ చేస్తున్నారు. గంటలతరబడి దాని గురించి వాదనలు, దానిని మళ్ళీ రెండు ఎపిసోడ్స్ గా టెలికాస్ట్ చేయడం, ఇలా పూర్తిగా ఈ సీజన్ గాడి తప్పడంతో టీఆర్ఫీ రేటింగ్స్ రోజురోజుకి పడిపోతున్నాయి. ఫలితంగా ఈ సీజన్ ఆరవ సీజన్ కంటే పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. అదే విధంగా ముందు సీజన్స్ లో కంటెస్టెంట్స్ మధ్య ఉన్న రిలేషన్ చాలా నిజాయితీగా ఉండేది. అది స్నేహం అయినా, శత్రుత్వం అయినా అలాగే కొనసాగిస్తూ వచ్చేవారు. కానీ ఈ సీజన్ ఈరోజు స్నేహంగా ఉండేవాళ్ళు, రేపు కొట్టుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు శత్రువులుగా ఉన్నవాళ్లు నేడు రాసుకొని పూసుకొని తిరుగుతున్నారు. ముఖ్యంగా ఈ కన్నడ బ్యాచ్ (యష్మీ, నిఖిల్, ప్రేరణ, పృథ్వీ) గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.

నిన్న చిన్న ఎగ్ దోశ విషయంలో నిఖిల్, ప్రేరణ, యష్మీ మధ్య పెద్ద గొడవ జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే నిఖిల్ ముందుగా ప్రేరణని ఒక ఎగ్ దోశ వేయమని చెప్తాడు. ప్రేరణ హడావడిలో వేయలేకపోతుంది. ఆ తర్వాత యష్మీ వచ్చి నిఖిల్ కోసం ఎగ్ దోశ వేస్తుంది. కానీ ప్రేరణ అడిగినప్పుడు వేయలేదు కాబట్టి నిఖిల్ చాలా యాటిట్యూడ్ చూపిస్తాడు. యష్మీ చాలా వరకు దోశ తినమని బ్రతిమిలాడుతుంది. కానీ నిఖిల్ తినడు, కనీసం నువ్వైనా చెప్పు తింటాడేమో అని పృథ్వీ కి చెప్తుంది, పృథ్వీ చెప్పినా కూడా తినడు. ఆ తర్వాత నభీల్ బలవంతంగా తినిపించే ప్రయత్నం చేస్తాడు. అయినా కూడా తినడు. ఇంత యాటిట్యూడ్ ఏంటో నిఖిల్ కి అని ప్రేరణ, యష్మీ ఫీల్ అవుతారు. చివరికి ఆ దోశ అలాగే మిగిలిపోయింది. ఆహరం విషయం లో ఇలా చేయడం చాలా తప్పు. ఇది ఈరోజు ఎపిసోడ్ లో చూపిస్తారో లేదో తెలియదు కానీ, ఒకవేళ చూపిస్తే మాత్రం వీకెండ్ లో నాగార్జున ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు క్లాన్స్ ని పూర్తిగా రద్దు చేసి, నాలుగు టీమ్స్ గా మార్చేశాడు బిగ్ బాస్. నిన్న మొన్నటి వరకు కలిసి ఆడిన కంటెస్టెంట్స్ ఇప్పుడు విడిపోయి ఆడే పరిస్థితి వచ్చింది.

అదే సమయంలో శత్రువులుగా కొట్టుకున్న కంటెస్టెంట్స్ ఇప్పుడు ఒకే టీంలో ఉంటూ ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో నిఖిల్, ప్రేరణ మధ్య..అదే విధంగా గౌతమ్, నిఖిల్ మధ్య పెద్ద గొడవలు జరిగినట్టు తెలుస్తుంది. మరో ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే పృథ్వీ చుట్టూ విష్ణు ప్రియ తిరగడం ఇప్పుడు పూర్తిగా తగ్గించేసింది. ఇది ఎంతకాలం కొనసాగుతుందో చూడాలి. మొన్న వీకెండ్ ఎపిసోడ్ లో పృథ్వీ నామినేషన్స్ నుండి సేవ్ అవ్వగానే విష్ణు ముద్దుపెట్టుకోవడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ఇప్పుడు ఆమె పృథ్వీ కి దూరంగా జరిగింది అంటే నమ్మలేకపొతున్నారు ఆడియన్స్. మళ్ళీ రేపో మాపో పృథ్వీ తో కలిసిపోతుందని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అనుకుంటున్నారు.