RGV Strong Counter: సినిమా టికెట్ల వివాదం ఏపీని కుదేపేస్తోంది. జగన్ సర్కార్ వర్సెస్ తెలుగు సినీ పరిశ్రమ అన్నట్లుగా మాటలయుద్ధం కొనసాగుతోంది. కొద్దిరోజుల క్రితం సినీ ఇండస్ట్రీ తరుపున పలువురు తమ సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే సర్కారు టికెట్ల తగ్గింపుపై మొండిగా ముందుకెళుతుండంతో ఇండస్ట్రీలోని వారంతా ఒక్కక్కరుగా స్పందిస్తున్నారు. వైసీపీ నేతలు సైతం సినిమా వాళ్లపై మాటలదాడికి దిగుతుండటంతో రోజురోజుకు వివాదం పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు.
వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ సైతం టికెట్ల రేట్ల తగ్గింపు అధికారం ప్రభుత్వానికి లేదంటూ వాదిస్తున్నారు. మీడియా చానళ్లలో డిబేట్లు, ట్వీటర్లలో పోస్టులు పెడుతూ హంగామా చేస్తున్నారు. ఆర్జీవీ లాజిక్కులకు సర్కారు నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావడం లేదు. ఈక్రమంలోనే ఆర్జీవీ ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రికి పది ప్రశ్నలను ట్వీటర్లో సంధించారు.
Also Read: ‘బంగార్రాజు’ను పట్టుకున్న బెంగ..!
ఆర్జీవీ ట్వీట్లకు మంత్రి స్పందించారు. పేదవాడికి అందుబాటులో ఉండేందుకు ధరలు తగ్గించినట్లు చెప్పుకొచ్చారు. సినిమా వ్యయాన్ని మీరే తగ్గించుకోవాలన్నట్లు సలహా ఇచ్చారు. అలాగే తనను కలువడానికి ఆర్జీవీకి అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈక్రమంలోనే నిన్న మధ్యాహ్నం ఏపీ మంత్రి నానితో ఆర్జీవీ భేటి అయ్యారు. ఈ సందర్భంగా టికెట్ల ఇష్యూపై తన వాదనలను ప్రభుత్వానికి బలంగా విన్పించినట్లు చెప్పారు.
ఈక్రమంలోనే వైసీపీ ఎమ్మెల్యే నన్నపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఓ సమావేశంలో మాట్లాడుతూ సినిమా హీరోలపై వివాదాస్పద కామెంట్లు చేయడం కొత్త వావాదానికి దారితీసింది. పేదవాళ్ల కోసం టికెట్ల రేట్లు తగ్గించామని.. హీరోలంతా వందల కోట్లు సంపాదించి బలిసి కొట్టుకుంటారనే అర్థంలో వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లకు చంద్రబాబు సపోర్టు ఉందని ఆరోపణలను గుప్పించారు. దీనిపై ఆర్జీవీ ఓ మీడియా ఛానల్ డిబెట్లో కౌంటర్ ఇచ్చాడు.
వైఎస్ జగన్ అంటే తనకు ఎంతో అభిమానం ఉందని, ప్రసన్నకుమార్ రెడ్డి లాంటి ఇడియట్స్ వల్లే ఆయనకు చెడ్డపేరు వస్తుందని తెలిపారు. ఇలాంటి వాళ్లను జగన్ దూరం పెట్టాలంటూ హితవు పలికారు. సినిమా గురించి ఏమి తెలియకుండా అవాకులు చెవాకులుపేలే వాళ్లను మూర్ఖులే అంటామని.. అలాంటి వాడి గురించి మాట్లాడటం శుద్ధ దండగ అంటూ వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఆర్జీవీ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు.
Also Read: ‘పుష్ప’ కి మరో స్టార్ హీరో ఫిదా.. ఎందుకు అందరూ పుష్ప పై పడ్డారు ?