Site icon OkTelugu

Karthika Deepam: కార్తీకదీపంలో ట్విస్ట్ అదిరింది.. ఏకంగా దీప వాళ్ళ దగ్గరకు సౌందర్య, ఆనందరావు!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏమి జరిగిందంటే.. ఆనందరావు ఆరోగ్యం గురించి ప్రకృతి వైద్యశాల దగ్గరికి వెళ్లడానికి సౌందర్య వాళ్లు సిద్ధమవుతారు. అది చూసిన మోనిత వెంటనే వాళ్లని ఫాలో అవుతోంది. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అని ఆలోచనలో పడుతుంది. మరోవైపు కార్తీక్, దీప బాబు గురించి సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా అంతలోనే దీప ఆనందరావును గుర్తు చేస్తుంది.

Karthika Deepam

ఆనంద రావు అని పేరు వినటంతో కార్తీక్ కు మోనిత చేసిన సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆ విషయాన్ని దీపకు చెప్పటంతో వాటిని మర్చిపోండి అంటూ.. మామయ్య తో గడిపిన క్షణాలను గుర్తు చేసుకోమని ధైర్యం ఇస్తుంది. ఇక సౌందర్య వాళ్లని ఫాలో అవుతున్న మోనిత బాగా ఇబ్బంది పడుతుంది. చివరికి వాళ్లంతా కార్తీక్ వాళ్ళు ఉన్న గ్రామం తాడికొండ కి చేరుతారు. ఆ గ్రామాన్ని చూసిన మోనిత షాక్ అవుతుంది.

Also Read:  విరాట్ కోహ్లీని చూసి ఫ్యాన్స్ షాక్.. ఆ వీడియోలో ఏముంది?

అక్కడే ఉన్న ప్రియమణి వీరికి ఏదైనా సహాయం చేస్తుందేమో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. కానీ చివరికి సౌందర్య వాళ్ళు ప్రకృతి వైద్యశాలకు వెళ్లటంతో అది చూసి ఊపిరి పీల్చుకుంటుంది. ఇక అదే ఊర్లో ప్రియమణి ఉందని తనని కలిస్తే ఏదైనా ప్లాన్
చేయవచ్చని అనుకుంటుంది. మరోవైపు ఇంట్లో సరుకులు లేకపోవటంతో దీప కార్తీక్ ను పిల్లలకు భోజనం ఎలా పెట్టారు అని ప్రశ్నిస్తుంది.

ఇక కార్తీక్ తన దగ్గర ప్రేమ ఉందని అంటాడు. అదే పనిగా కార్తీక్ ఆలోచించటం తో దీప ఏమి ఆలోచనలు పెట్టుకోకండి అని సర్ది చెబుతుంది. ఆ తర్వాత ఇంట్లో దీప లేకపోవడంతో కార్తీక్ పిల్లలకు భోజనం చేసి పెడతాడు. కానీ పిల్లలకు అది నచ్చకపోవడంతో అప్పుడే దీప వచ్చి వారికి నచ్చ చెప్తుంది. తరువాయి భాగంలో మోనిత ప్రియమణి వెతుకుతుండగా వెనకాల నుండి దీప బాబు తో వస్తుంది. మొత్తానికి ఈ ట్విస్ట్ బాగా ఆసక్తి గా అనిపిస్తుంది.

Also Read:  అకీరాకి కరోనా పాజిటివ్.. పవన్ సాయం నిరాకరించిన రేణూ దేశాయ్ ! కారణమిదే

Exit mobile version