Yatra 2 Trailer: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన చిత్రం యాత్ర.. ఐదేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్‌గా యాత్ర2 రాబోతోంది. ఫిబ్రవరి 8న రిలీజ్ కానుంది. వైఎస్సార్ తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు. 2009 నుంచి 20019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో యాత్ర2ను తెరకెక్కించారు.
ట్రైలర్ రిలీజ్..
ఇదిలా ఉండగా యాత్ర2 ట్రైలర్ శనివారం రిలీజ్ అయింది. సినిమాపై అంచనాలను అమాంతం పెచేలా ఇందులో అద్భుతమైన డైలాగ్స్ ఉన్నాయి. ఈ సినిమాను మహీ వి.రాఘవన్ తెరకెక్కించారు. యాత్రలో వైఎస్.రాశేఖరరెడ్డి మాత్రమే కనిపించారు. యాత్ర 2లో వైఎస్సార్‌తోపాటు ఆయన కుమారుడు జగన్ కనిపించడం ఆసక్తిగా మారింది. ఈ చిత్రంలో వైఎస్సార్ పాత్రను మమ్ముట్టి మరోమారు చేశారు. జగన్ క్యార్టెర్‌ను జీవా పోషిస్తున్నారు. ట్రైలర్‌లో కొన్ని పంచ్ డైలాగ్స్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఇప్పటికే విడుదలైన యాత్ర 2 టీజర్, సాంగ్స్ సినీ ప్రేక్షకులతోపాటు వైఎస్సార్ అభిమానుల గుండెలను తాకాయాయి. తాజాగా ట్రైలర్‌తో అంచనాలు మరింత పెంచారు మేకర్స్.
వైఎస్సార్ మరణానంతరం..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హెలిక్యాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత ఆయన తనయుడు జగన్ ఓదార్పు యాత్ర చేపట్టడం, దానిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు కుట్రపన్నిన తీరును ట్రైలర్‌లో చూపించారు. ట్రైలర్‌లో కాంగ్రెస్ నాయకుల హెచ్చరికలు ఉన్నాయి. దేశంలో ఎవడైరా కాంగ్రెస్‌కు ఎదురు తిరిగాలంటే భయపడేలా ఉండాలి అన్న వార్నింగ్.. దానిని లెక్కచేయకుండా జగన్ జనంలోకి వెళ్లడాన్ని చూపించారు. ‘‘జగన్‌రెడ్డి కడపోడు సార్.. శత్రువు మీద ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాక వాడు నాశనమై పోతాడని తెలిసినా శత్రువుకు తల వంచడు సార్’’ అని కాంగ్రెస్ అగ్రనాయకుడికి ఏపీ నాయకుడు చెప్పిన సీన్ హైలెట్‌గా ఉంది. మరో సీన్‌లో ‘‘పుట్టుకతోనే చెవుడు ఉంది అన్న.. చెవుడు కారణంగా మాటలు రావు. ఏదో మిషిన్ పెడితే వినబడి మాటలు వస్తాయని డాక్టర్లు చెప్పిండు అన్నా.. మాకు అంత స్థోమత లేదు’ అని ఓ సామాన్యురాలు తన కూతురు గురించి సీఎం వైఎస్సార్(మమ్ముట్టి)కి చెప్పడంతో ట్రైలర్ ప్రారంభించారు. చివరల్లో ఓ అంధుడు ‘నువ్వు మా వైఎస్సార్ కొడుకువు అన్నా.. మాకు నాయకుడిగా నిలబడు అన్నా’ అనగానే ‘నేను విన్నాను..నేను ఉన్నాను’ అని జగన్(జీవా) చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ముగిసింది.