Yashoda Collections: సమంత హీరోయిన్ ఓరియంట్డ్ గా వచ్చిన ‘యశోద’ మూవీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. మొదట్లో యావరేజ్ ఫిలిం అని టాక్ వచ్చినా కమర్షియల్ గా సినిమా సక్సెస్ ను తెచ్చుకుంది. శ్రీదేవీ మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో వచ్చిన యశోద నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. ఇప్పటికే ఈ మూవీ 20 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అయితే మలేషియా లాంటి దేశంలో సమంత మూవీకి క్రేజ్ విపరీతంగా పెరిగింది. దీంతో అక్కడ థియేటర్లను పెంచారు. ఈ క్రమంలో 5వ రోజు ఊహించని వసూళ్లు రావడంతో సినీ ఇండస్ట్రీ షాక్ అయింది.

పాన్ ఇండియా లెవల్లో సమత యశోద మూవీని 464 థియేటర్లో 1052 పట్టణాల్లో రిలీజ్ చేశారు. తెలుగులో 77 వేలు, హిందీలో 13 వేలు, తమిళ్ లో 11 వేలు, మలయాళంలో 502 తెరలపై యశోద రన్ అవుతోంది. వీటిలో తొమ్మిది చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి. మిగతా చోట్ల 20 శాతం ఆక్యుపెన్సీ సాధిస్తోంది. దేశంలోనే కాకుండా విదేశాల్లో సమంత మూవీ దిమ్మదిరిగే కలెక్షన్లు చేస్తోంది. మలేషియాలో ఈ మూవీకి విపరీతమైన క్రేజ్ పెరిగింది. దీంతో 5వ రోజు థియేటర్లను పెంచారు.
ఇదిలా ఉండగా అమెరికాలో హాఫ్ మిలియన్ క్లబ్ లో ఈ సినిమా చేరడం విశేషం. అంటే విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 500 కె వసూళ్లు చేసింది. మంగళవారం ఒక్కరోజే 165 లోకేషన్లలో 41వేల డాలర్లను రాబట్టింది. దీంతో హాఫ్ మిలియన్ క్లబ్ లో చేరినట్లు ప్రకటించారు. రానున్న రోజుల్లో మిలియన్ క్లబ్ లో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని ట్రేడ్ వర్గాలంటున్నాయి. మొత్తంగా ఓవర్సీస్ లో సమంత మూవీ క్రేజీ వసూళ్లు సాధిస్తోంది. గతంలో ఈ బ్యూటీ నటించి ఓ బేబీ కూడా 1 మిలియన్ డాలర్లను వసూలు చేసింది.

యశోద 5వ రోజు దిమ్మదిరిగే కలెక్షన్లు కొల్లగొట్టింది. ఈరోజున తెలుగులో 88 లక్షలు, హిందీలో 9 లక్షలు, తమిళంలో 16 లక్షలు వచ్చాయి. అన్ని భాషల్లో కలుపుకొని దేశవ్యాప్తంగా 1.13 కోట్లు సాధించింది. నాలుగు రోజుల్లో 11.6 కోట్లు వచ్చాయి. ఐదో రోజు తో కలుపుకుని మొత్తం 12.76 కోట్లు వసూళ్లు చేసిందని అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 17 కోట్లు రాబట్టినట్లు చెబుతున్నారు. ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ ఇంత వసూళ్లు చేయడంతో సమంతకు క్రేజీ విపరీతంగా పెరుగుతోంది.