spot_img
Homeఎంటర్టైన్మెంట్Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. 'ఉల్లాసంగా ఉత్సాహంగా' హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల సంఖ్యలో సినిమాలు చేసిన , ఎన్నో ఏళ్ళ అనుభవం ఉన్న హీరోలు కూడా సాధించలేని ఫేమ్ ని కొంతమంది కేవలం ఒక్క సినిమా తోనే సంపాదిస్తూ ఉంటారు. అలాంటి హీరోల్లో ఒకరు యశో సాగర్. ఈ పేరు నేటి తరం ప్రేక్షకులకు పెద్దగా తెలియక పోవచ్చు. కానీ ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ మూవీ హీరో అంటే అందరూ గుర్తుపడతారు. కరుణాకరన్ దర్శత్వం లో తెరకెక్కిన ఈ సినిమా ఆరోజుల్లో కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్. ఒక కొత్త హీరో ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ కొట్టేసరికి ఆరోజుల్లో అందరి చూపు ఈ కుర్ర హీరో మీదకు మరలింది.

నటన పరంగా కూడా మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసాడు. ఎవరీ అబ్బాయి , చాలా చురుగ్గా ఉన్నాడే, కచ్చితంగా భవిష్యత్తులో పెద్ద రేంజ్ కి వెళ్లాడని అంతా అనుకున్నారు. మొదటి సినిమాతోనే పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టడం తో , ఈ యువ హీరో ఇంటి చుట్టూ అప్పట్లో నిర్మాతలు తిరిగేవారు. అతి తక్కువ సమయం లోనే వెండితెర పై ఒక వెలుగు వెలిగే అద్భుతమైన అవకాశం ఈ హీరో కి వచ్చింది. కానీ మనం ఒకటి తలిస్తే , దేవుడు ఒకటి తలుస్తాడు , ఆయన రాసిన ఆ తలరాత ని ఎవ్వరూ మార్చలేరు. అలా పాపం ఈ యువ హీరో గత జన్మలో ఏమి పాపం చేసాడో ఏమో తెలియదు కానీ , దేవుడు సక్సెస్ రుచి చూపించి దాన్ని ఎంజాయ్ చేసేలోపే తన దగ్గరకు తీసుకెళ్లిపోయాడు . 2012 వ సంవత్సరం , డిసెంబర్ 19 న రాత్రి జరిగిన ఒక రోడ్డు ప్రమాదం లో యశో సాగర్ చనిపోయారు.

తన స్నేహితులు విశ్వనాధ్ రెడ్డి , లోకేష్ లతో కలిసి పుణెకు కాస్ట్యూమ్స్ కోసం వెళ్లిన యశో సాగర్ , తిరిగి రిటర్న్ అవుతున్న సమయం లో, కర్ణాటక లోని తుముకూరు దగ్గర తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదం లో అక్కడికక్కడే చనిపోయారు. ఆరోజుల్లో ఈ హీరో మరణ వార్త విని కోట్లాది మంది సినీ అభిమానులు తీవ్రమైన విచారం వ్యక్తం చేశారు. యశో సాగర్ కన్నడ నిర్మాత బీపీ సోము కొడుకు. తన కొడుకుని ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ అనే చిత్రం తో వెండితెర కి పరిచయం చేశారు. కేవలం నాలుగు కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా, ఆరోజుల్లోనే 16 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ సినిమా తర్వాత మిస్టర్ ప్రేమికుడు అనే చిత్రం లో నటించారు యశో సాగర్. కానీ ఈ సినిమా విడుదలకు ముందే చనిపోవడం దురదృష్టకరం.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...
Oktelugu Epaper