Bigg Boss 9 Telugu Tanuja: ప్రస్తుతం నడుస్తున్న బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) లో టైటిల్ విన్నర్ గా ఎవరు నిలబడబోతున్నారు అనే ప్రశ్న వస్తే , ఈ షో ని చూసే ప్రతీ ఒక్కరు తనూజా పేరే చెప్తారు. ఎందుకంటే ఆమె గొప్పగా ఆట ఆడిందని కాదు, సోషల్ మీడియా లో ఆమెకు పడుతున్న ఓట్లను చూసి చెప్పొచ్చు. యూట్యూబ్ పోల్స్, వెబ్ సైట్ పోల్స్, ట్విట్టర్ పోల్స్, ఫేస్ బుక్ పోల్స్ ఇలా ఏ పోల్ చూసినా తనూజ కి దరిదాపుల్లో మరో కంటెస్టెంట్ లేరు. రెండవ స్థానం లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు, కానీ తనూజ కి పడుతున్న ఓటింగ్ లో సగం కూడా అతనికి రావడం లేదు. మొదటి రెండు స్థానాల మధ్య ఇంత గ్యాప్ ఉండడం హిస్టరీ లో ఎప్పుడూ జరగలేదు. అయితే తనూజ కి ఫ్యాన్ బేస్ ఎంత ఉందో, ఆమెకు నెగిటివిటీ కూడా అదే రేంజ్ లో ఉంది.
Also Read: పవన్ కళ్యాణ్, లోకేష్ కనకరాజ్ మూవీ లో ప్రభాస్..కనీవినీ ఎరుగని రేంజ్ ప్లానింగ్!
ముఖ్యంగా హౌస్ లో ఆమెతో ఎంతో క్లోజ్ గా ఉండే ఇమ్మానుయేల్ కి సంబంధించిన పీఆర్ టీమ్ ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ లో తనూజ కి వ్యతిరేకంగా ఎన్నో వందల పోస్టులు పెడుతున్నారు. ఇక గత సీజన్ కంటెస్టెంట్ యష్మీ కూడా తనూజ కి వ్యతిరేకంగా మారిపోయింది. వాస్తవానికి వీళ్లిద్దరు బయట స్నేహితులు,కలిసి అనేక ఈవెంట్స్ కూడా చేసారు. అయినప్పటికీ కూడ యష్మీ ఇలా తనూజ కి నెగిటివ్ అయిపోవడం అందరినీ షాక్ కి గురి చేసింది. కేవలం యష్మీ మాత్రమే కాదు, ఆమెతో పాటు శ్రీ సత్య కూడా కామెడీయూ చేసింది. కాసేపటి క్రితమే యష్మీ తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక స్టోరీ ని అప్లోడ్ చేసింది. స్విమ్మింగ్ పూల్ లో యష్మీ, శ్రీ సత్య ఇద్దరు ఉంటారు. శ్రీ సత్య యష్మీ పై నీళ్లు చెల్లుతుంది.
అప్పుడు యష్మీ ‘చూడండి ఫ్రెండ్స్..ఈ పిల్ల ముద్దుగా మాట్లాడుతూ చెవిలో మందార పూలు పెడుతుంది’ అని అంటుంది. అప్పుడు శ్రీ సత్య ‘ఏడువు రా..ఏడువు’ అని అంటుంది. తనూజ ని పాపం ఒక రేంజ్ లో రోచ్ చేస్తున్నట్టు అనిపించింది. వీళ్ళందరికీ ఇంత కోపం ఎందుకంటే, మేమంతా ఇంత కస్టపడి గేమ్ ఆడి కనీసం టాప్ 5 లోకి కూడా వెళ్లలేకపోయాం. కానీ ఈమె మాత్రం హౌస్ లో అందరి సపోర్టు తీసుకొని గేమ్ ఆడడం, బయట కూడా తన పీఆర్ టీం తో వేరే లెవెల్ పబ్లిసిటీ చేయడం వల్ల, ఆమెపై ఇంతటి నెగిటివిటీ క్రియేట్ అయ్యింది. అసలే విపరీతమైన ఎమోషనల్ స్వభావం గల తనూజ, బయటకు వచ్చిన తర్వాత ఇదంతా చూసి ఏమైపోతుందో అని ఆమె అభిమానులు బాధ పడుతున్నారు.
BB 9 launch day Yahsmi posted story about Thanuja congratuating her
From that to this
Friends kuda ardam aipoyinatu undi mana lady tiger thanuja gari game #BiggBossTelugu9 pic.twitter.com/QAEJed3fVJ
— Maga Maha Raj (@maga_rah) October 30, 2025