Pradeep Ranganathan: రెండు మూడు హిట్ సినిమాల తర్వాత ఏ హీరో అయినా , హీరోయిన్ అయినా రెమ్యూనరేషన్ ని భారీగా పెంచడం సహజం. అలాంటిది కేవలం హీరో ఇమేజ్ కారణంగా వసూళ్లు వచ్చే రేంజ్ ఎదిగిన వాళ్ళు, భారీ రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఉంటారా?, ఉండరు కదా?, ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) కూడా అదే చేస్తున్నాడు. ఇతనికి తెలుగు, తమిళ ఆడియన్స్ లో క్రేజ్ బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ అయితే ప్రదీప్ సినిమా వస్తే చాలు, కచ్చితంగా థియేటర్ లో చూడాల్సిందే అనే మైండ్ సెట్ కి వచ్చేసారు. అందుకు రీసెంట్ ఉదాహరణ డ్యూడ్. ఇదే సినిమాని వేరే తమిళ హీరో చేసుంటే డిజాస్టర్ ఫ్లాప్ అయ్యేది. కానీ ప్రదీప్ రంగనాథన్ కారణంగా ఈ సినిమా వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి ఇప్పటికీ విజయవంతంగా థియేటర్స్ లో నడుస్తూనే ఉంది.
Also Read: పవన్ కళ్యాణ్, లోకేష్ కనకరాజ్ మూవీ లో ప్రభాస్..కనీవినీ ఎరుగని రేంజ్ ప్లానింగ్!
ఈ రేంజ్ స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత ప్రదీప్ రంగనాథన్ తన తదుపరి చిత్రాలకు భారీగా రెమ్యూనరేషన్స్ డిమాండ్ చేయాలనీ ఫిక్స్ అయ్యాడట. ప్రస్తుతం ఆయన హీరో గా నటించిన ‘LIK’ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు ఆయన ఇంతకుముందు 10 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకున్నాడట. కానీ ఇక నుండి ఆయన సినిమాకు పాతిక కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. థియేట్రికల్ బిజినెస్ ప్రదీప్ సినిమాకు ప్రస్తుతం 60 కోట్ల రూపాయలకు పైగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ‘డ్యూడ్’ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషలకు కలిపి 60 కోట్ల రూపాయలకు జరిగింది. దీంతో పాటు నాన్ థియేట్రికల్ రైట్స్ 70 కోట్ల రూపాయిల వరకు జరగొచ్చు. కేవలం తన పేరు మీద 130 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంది.
మరి ఆయన కారణంగా ఇంత బిజినెస్ జరుగుతున్నప్పుడు 25 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేయడం లో న్యాయం ఉంది కదా?. ఒకవేళ మంచి డైరెక్టర్ తో సినిమా చేస్తే కేవలం థియేట్రికల్ బిజినెస్ వంద కోట్ల రూపాయలకు జరగొచ్చు. కాబట్టి ప్రదీప్ అంత రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేయడం లో ఎలాంటి తప్పు లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మన టాలీవుడ్ లో నాని, విజయ్ దేవరకొండ వంటి హీరోలు ఎప్పటి నుండో ఇండస్ట్రీ లో ఉన్నారు. వీళ్ళు కూడా ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకోవడం లేదు. అలాంటిది నిన్న గాక మొన్న ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ కుర్ర హీరో, మొదటి మూడు సినిమాలతోనే ఈ రేంజ్ మార్కెట్ క్రియేట్ చేసుకోవడం అనేది చిన్న విషయం కాదు. రాబోయే రోజుల్లో ఆయన ఇంకా ఏ రేంజ్ కి వేళ్తాడో చూడాలి.