https://oktelugu.com/

Yash- NTR: ఎన్టీఆర్ ఫ్యామిలీ న‌న్ను అలా ట్రీట్ చేస్తారు.. య‌శ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Yash- NTR: క‌న్న‌డ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించిన ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి టాక్ ని సొంతం చేసుకుంది. మొద‌ట‌గా రిలీజైన కేజీఎఫ్ సినిమా ఇండియ‌న్ సినిమాలో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అన్న తేడా లేకుండా విడుదలయిన అన్ని చోట్లా రికార్డులు సొంతం చేసుకుంది. ఈ సినిమాలో హీరోగా నటించిన యష్ భారీ క్రేజ్ తో అన్ని భాషల్లోనూ […]

Written By:
  • Mallesh
  • , Updated On : April 14, 2022 / 03:41 PM IST
    Follow us on

    Yash- NTR: క‌న్న‌డ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించిన ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి టాక్ ని సొంతం చేసుకుంది. మొద‌ట‌గా రిలీజైన కేజీఎఫ్ సినిమా ఇండియ‌న్ సినిమాలో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అన్న తేడా లేకుండా విడుదలయిన అన్ని చోట్లా రికార్డులు సొంతం చేసుకుంది. ఈ సినిమాలో హీరోగా నటించిన యష్ భారీ క్రేజ్ తో అన్ని భాషల్లోనూ అభిమానులను సంపాదించుకున్నాడు. ఒక్క యష్ మాత్రమే కాదు. సినిమాలో నటించిన ఇతర నటులు కూడా పేరు ప్రఖ్యాతులు పొందారు. చాప్ట‌ర్ 2 కూడా రికార్డుల సృష్టించ‌నుంది.

    Yash- NTR

    అయితే కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 సినిమా విడుదల సందర్భంగా చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఎన్నో ఇంట‌ర్వ్యూలు ఇచ్చారు. సినిమాకు సంబంధించిన‌ కార్యక్రమాలు జోరుగా ప్ర‌చారం చేశారు. ఈ క్రమంలో యశ్ ఆర్ఆర్ఆర్ హీరోల‌తో తనకు ఉన్న‌ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రీసెంట్ గా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో యష్ కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. దీన్ని యాంకర్ సుమ హోస్ట్ చేశారు.

    Also Read: Nellore Politics: నెల్లూరులో కాక రేపుతున్న కాకాని.. అనిల్ యాదవ్ కు ముచ్చెమటలు

    ఈ సందర్భంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ లపై య‌శ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుమ ప్రశాంత్ నీల్ ని ఆర్ఆర్ఆర్ సినిమా గురించి అడగగా చాలా అద్భుతంగా ఉందని, రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ లపై ప్రశంసలు కురిపించారు. ఆర్ఆర్ఆర్ ఒక సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అని పెద్ద స్క్రీన్ పై చూసి థ్రిల్ అయ్యానని య‌శ్ అన్నారు.

    Yash- NTR

    రామ్ చరణ్ తో వ్యక్తిగతంగా పరిచయం ఉందని అన్నారు. హైదరాబాద్ లో ఎక్కడ షూటింగ్ చేసినా.. చరణ్ ఇంటి నుంచి భోజనం పంపిస్తారని తమ మధ్య అంతకుమించి స్పెషల్ బాండింగ్ ఉందని యష్ చెప్పుకొచ్చారు. అలాగే ఎన్టీఆర్ గురించి చెప్తూ ఎన్టీఆర్ త‌ల్లి షాలిని త‌న‌ని ఫ్యామిలీ మెంబర్ లా ట్రీట్ చేస్తుంద‌ని చెప్పాడు. తనని డిన్నర్ కి ఆహ్వానించారని తారక్ ఫ్యామిలీ తనను బాగా రిసీవ్ చేసుకుందని చెప్పారు. ముఖ్యంగా ఎన్టీఆర్ తల్లి షాలిని గారు తనను బాగా చూసుకున్నారని చెప్పుకొచ్చారు. ఆమె కూడా కర్ణాటకకు చెందిన వారు కావడంతో ఇద్దరి మధ్య ప్రాంతీయ అనుబంధం ఏర్పడిందన్నారు. ఎన్టీఆర్ ఫ్యామిలీ ఇచ్చిన ఆతిథ్యాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని గుర్తుచేసుకున్నారు.

    Also Read:RRR vs KGF 2 Box Office Collection: షాకింగ్ : అక్కడ ఆర్ఆర్ఆర్ కి 20 కోట్లు, కేజీఎప్ కి 45 కోట్లు !

    Tags