Pan Card: ఇటీవల కాలంలో ఆన్ లైన్ మోసాలు పెరుగుతున్నాయి. మనకు తెలియకుండానే మన ఖాతాలోని డబ్బులు మాయం కావడం చూస్తూనే ఉన్నాం. ఇంకా మన ప్రమేయం లేకుండానే మన పేరు మీద రుణం తీసుకునే వీలుంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తు.న్నారు అపరిచితులకు మీ వివరాలు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదని చెబుతున్నారు.

ఆన్ లైన్ మోసాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇటీవల హైదరాబాద్ లో వివిధ వ్యక్తుల ఖాతాల నుంచి రూ.75 లక్షలు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. వారి వివరాలు ఆరా తీయగా అంతా జార్ఖండ్, ఉత్తరాఖండ్ వ్యక్తులని తేలింది. దీంతో వారిపై కేసు పెట్టాలంటే అక్కడికి వెళ్లాలి. పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అందుకే ముందుచూపుతో వ్యవహరిస్తేనే మంచిదనే అభిప్రాయం అందరిలో వస్తోంది.
Also Read: Nellore Politics: నెల్లూరులో కాక రేపుతున్న కాకాని.. అనిల్ యాదవ్ కు ముచ్చెమటలు
చాలా సందర్భాల్లో మనకు తెలియకుండానే మన పేరుతో రుణం తీసుకుంటే తరువాత మనం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే ముందే మన పాన్ కార్డు చెక్ చేసుకుని జాగ్రత్త పడాలి. కొందరు మోసకారులు యజమానులకు తెలియకుండానే పాన్ కార్డు సహాయంతో రుణాలు తీసుకుంటారు. పాన్ కార్డు మీ వద్ద ఉన్నా మీ నెంబర్ తో రుణం పొందే వీలుంటుంది. అందుకే మనం సీఐబీఐఎల్ స్కోర్ ని తనిఖీ చేసుకుంటే తెలిసిపోతోంది.

సీఐబీఐఎల్ స్కోర్ ను తనిఖీ చేస్తే మీ పేరు మీద రుణం తీసుకుంటే తెలియజేస్తుంది. ఫెన్ టెక్ ప్లాట్ ఫారమ్ సాయంతో కూడా తెలుస్తుంది. ఇక మూడో మార్గం 26ఏ తనిఖీ చేయడం. దీని ద్వారా కూడా మీ పాన్ కార్డుపై ఎవరైనా రుణం తీసుకుంటే తెలుస్తుంది. 26ఏ ద్వారా ఆదాయపన్ను శాఖ ద్వారా మన లావాదేవీలు తెలిసిపోతాయి. దీంతో మన పాన్ కార్డు ద్వారా ఎవరైనా లోన్ తీసుకుంటే కనిపెట్టొచ్చు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరిని నమ్మడానికి వీలు లేదు. అందుకే మనం నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ఇందుకోసం మన వివరాలు ఎవరికి తెలియకుండా చూసుకోవాలి. ఒకవేళ ఎవరైనా అడిగితే చెప్పకూడదు. సులువుగా మోసపోయే అవకాశాలున్నాయి. దొంగలు మోసాలతోనే డబ్బులు కాజేస్తున్నారు. దీనికి గురికాకుండా నిరంతరం మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు.
Also Read:Ram Gopal Varma: బాలీవుడ్ కి ఏమైంది.. మన రికార్డ్ ని కొట్టేవాడే లేడా.. ఆర్జీవీ ట్వీట్ వైరల్