Yamadonga Re Release: టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ ఏ రేంజ్ లో కొనసాగుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఈ ట్రెండ్ లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లదే ప్రస్తుతానికి పై చెయ్యి. మిగిలిన హీరోల సినిమాలు వీళ్ళ పాత సినిమాల రేంజ్ లో సక్సెస్ అవ్వడం లేదు. అయితే ఆమధ్య ఎన్టీఆర్(Junior NTR) ‘సింహాద్రి'(Simhadri Re Release) రీ రిలీజ్ అయ్యి ఆంధ్ర ప్రదేశ్, ఓవర్సీస్ ప్రాంతాల్లో భారీ వసూళ్లను నమోదు చేసుకొని ఆల్ టైం రికార్డుని నెలకొల్పింది. కానీ నైజాం ప్రాంతం లో మాత్రం మిశ్రమ ఫలితం లభించింది. ఓవరాల్ గా ఆరోజుల్లో పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ తర్వాత అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా టాప్ 2 లో నిల్చింది ఈ చిత్రం. ఆ తర్వాత ఎన్టీఆర్ పీఆర్ టీం గ్రాండ్ గా ఒక్క రీ రిలీజ్ ని కూడా ప్లాన్ చేయలేదు.
Also Read: సూర్య కూతురు ఇంటర్ మార్కుల పట్టిక చూసారా..? దిమ్మతిరగడం ఖాయం!
కానీ ఈసారి మాత్రం చాలా గ్రాండ్ గా చేయాలని నిర్ణయించుకుంది. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో ఫేడ్ అవుట్ అయ్యే స్థితిలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ కి సరికొత్త ఊపిరిని పోసిన చిత్రం ‘యమదొంగ’. ఈ సినిమా ఆయన జీవితాన్నే మలుపు తిప్పింది. అంతకు ముందు ఎంతో లావుగా కనిపించిన ఎన్టీఆర్, ఈ సినిమాలో చిక్కిన చిరుత పులి లాగా కనిపించాడు. ఈ చిత్రం నుండి నేటి వరకు అదే తరహా బాడీ ని మైంటైన్ చేస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు. అలా తనకు కొత్త జీవితాన్ని ఇచ్చిన ‘యమదొంగ’ చిత్రాన్ని ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నారు. 18 వ తేదీన విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ నిన్న ప్రారంభించారు. రెస్పాన్స్ భీభత్సంగా ఉంటుందని అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు కానీ, కనీసం స్థాయిలో కూడా బుకింగ్స్ జరగకపోవడం అందరినీ షాక్ కి గురి చేసింది.
హైదరాబాద్ లో బుకింగ్స్ చాలా స్పీడ్ గా ఉండే శ్రీ రాములు, సంధ్య 35 MM, సంధ్య 70 MM , సుదర్శన్, భ్రమరాంబ వంటి టాప్ థియేటర్స్ ని ఎంచుకొని బుకింగ్స్ మొదలెట్టారు. కేవలం సుదర్శన్ థియేటర్ ఒక్కటే ఫుల్ అయ్యింది, మిగిలిన థియేటర్స్ కి కనీస స్థాయిలో కూడా బుకింగ్స్ జరగలేదు. ఎన్టీఆర్ అభిమానులు ఈ ట్రెండ్ ని చూసి ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఈ చిత్రానికి కావాల్సినంత ప్రొమోషన్స్ చేయడం లో నిర్వాహకులు విఫలం అయ్యారు అంటూ మండిపడుతున్నారు. పైగా ఇప్పుడు జనాల మూడ్ కూడా వేరేలా ఉంది. భారత్, పాకిస్తాన్ మధ్య జరగుతున్న ఉద్రిక్తత పరిస్థితుల నడుమ ఇప్పుడు థియేటర్స్ కి వెళ్లి చూసేంత ఉత్సాహం మన ఆడియన్స్ లో లేకపోయి ఉండొచ్చు, అంతే కాకుండ యమదొంగ చిత్రం కల్ట్ క్లాసిక్ కాదు, కేవలం నందమూరి అభిమానుల కోసం తీసిన సినిమా కాబట్టే ఈ రెస్పాన్స్ వచ్చిందని అంటున్నారు.