Yagnam Movie: తమ మొదటి సినిమాతోనే అందంతో, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేస్తూ ఉంటారు. కానీ ఆ తర్వాత వీళ్ళు అనుకోకుండా సినిమాలకు దూరంగా ఉంటారు. అందులో ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ సమీరా బెనర్జీ కూడా ఒకరు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈమె ఒకప్పుడు అద్భుతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. టాలీవుడ్ హీరో గోపీచంద్ కెరీర్లో ఇప్పటివరకు చేసిన సినిమాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాగా నిలిచిన సినిమా యజ్ఞం. అప్పటివరకు సినిమాలలో విలన్ పాత్రలలో నటించిన గోపీచంద్ కు హీరోగా సరైన బ్రేక్ ఇచ్చిన సినిమా యజ్ఞం. ఈ సినిమాతో హీరోగా గోపీచంద్ ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తర్వాత హీరోగా వరుస అవకాశాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు. యజ్ఞం సినిమాతోనే తెలుగు సినిమా ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయం అయ్యింది సమీరా బెనర్జీ అలియాస్ మూన్ బెనర్జీ. ఈమె హీరోయిన్ దా మొదటి సినిమాతోనే అందరి నుంచి ప్రశంసలు అందుకుంది. తన అందంతో, అభినయంతో ప్రేక్షకుల హృదయంలో స్థానం సంపాదించుకుంది. యజ్ఞం సినిమా సూపర్ హిట్ తర్వాత ఈమెకు తెలుగులో అవకాశాలు క్యూ కడతాయి అని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు అని చెప్పొచ్చు.
Also Read: విడాకుల బాటలో నజ్రియా, ఫహద్ ఫాజిల్..? సంచలనం రేపుతున్న లేటెస్ట్ పోస్ట్!
యజ్ఞం సినిమా తర్వాత ఆమె మరొక సినిమాలో కనిపించలేదు. సమీరా బెనర్జీ కోల్కతాకు చెందిన అమ్మాయి. ఈమె 1997 నుంచి హిందీ సీరియల్స్ లో కూడా నటిస్తుంది. బాలీవుడ్ బుల్లితెరపై సమీరా బెనర్జీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ తర్వాత ఈ చిన్నది సినిమాలలోకి అడుగు పెట్టింది. అటు సీరియల్స్ లో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూనే ఇటు సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంది. యజ్ఞం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన కూడా సమీరా బెనర్జీకి మాత్రం తెలుగులో మరొక అవకాశం రాలేదు. అలాగే ఇతర భాషలలో కూడా ఆమె సినిమాలలో నటించలేదు. తిరిగి మళ్లీ బుల్లితెర మీద సీరియల్స్ లోనే నటిస్తుంది.
View this post on Instagram
ప్రస్తుతం సమీరా బెనర్జీ హిందీలో దొరి అనే సీరియల్ లో నటిస్తుంది. ఒకప్పుడు హీరోయిన్గా తన అందంతో అందరినీ మాయ చేసిన సమీరా బెనర్జీ ప్రస్తుతం బుల్లితెర మీద సీరియల్లో అత్త పాత్రలో నటిస్తుంది. సోషల్ మీడియాలో కూడా సమీరా బెనర్జీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా సమీరా బెనర్జీ లేటెస్ట్ లుక్ చూసి తెలుగు అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. గోపీచంద్ యజ్ఞం సినిమాలో చాలా అందంగా కనిపించిన సమీరా బెనర్జీ ప్రస్తుతం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది అంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: ఈ నటుడి భార్య కూడా టాలీవుడ్ లో స్టార్ నటి.. ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..