Dragon Teaser : ‘దేవర'(Devara Movie) వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్(Junior NTR) నుండి ‘వార్ 2′(War 2 Movie) చిత్రం ఈ ఏడాది ఆగష్టు 14న విడుదల కాబోతుంది. ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి అవ్వడంతో ఎన్టీఆర్ ఇప్పుడు ప్రశాంత్ నీల్(Prashanth Neel) ‘డ్రాగన్'(Dragon) మూవీ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఈ నెల 22న మొదలు అవ్వబోయే రెండవ షెడ్యూల్ లో ఎన్టీఆర్ సెట్స్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఎంత సన్నబడ్డాడో మన కళ్లారా చూసాము. ఇప్పటికే మొదటి షెడ్యూల్ ని మొదలు పెట్టి ఎన్టీఆర్ లేని సన్నివేశాలను చిత్రీకరించారు. యదార్ధ సంఘటనలను ఆధారంగా తీసుకొని ఈ సినిమాని చిత్రీకరించబోతున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అయితే తన సినిమాల్లోని హీరోలను స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా భారీగా చూపించే అలవాటు ఉన్న ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ ని మాత్రం ఎందుకు ఇంత బక్కగా చూపిస్తున్నాడు అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
Also Read : కాలేజీలో అందంగా లేవంటూ కామెంట్స్ చేసేవారు.. కానీ ప్రస్తుతం ఇండస్ట్రీని ఊపేస్తున్న హీరోయిన్..
ఇక పోతే ఏప్రిల్ 22 నుండి మూడు వారాల పాటు ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించబోతున్నాడట. అసలు విరామం అనేదే లేకుండా ఈ షెడ్యూల్ జరగనుంది. మే 20 వ తారీఖున జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఒక గ్లింప్స్ వీడియో ని విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. ఈ గ్లింప్స్ వీడియో తోనే ఈ సినిమా ఎంత భారీగా ఉండబోతుందో అభిమానులకు చూపించబోతున్నారు. టైటిల్ ‘డ్రాగన్’ గా దాదాపుగా ఫిక్స్ అయిపోయినట్టే అనుకోవచ్చు. ఇంకా మంచి టైటిల్స్ ని కూడా పరిశీలిస్తున్నారు మేకర్స్. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు కానీ, అది దాదాపుగా అసాధ్యమే అని తెలుస్తుంది.
వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రం లో హీరోయిన్ గా కన్నడ బ్యూటీ రుక్మిణి వాసంత్ నటించనుంది. ఈమె ‘సప్త సాగరాలు ఎల్లో సైడ్ A/B’ సిరీస్ తో మన తెలుగు ఆడియన్స్ కి పరిచయమైంది. అంతే కాకుండా ఈ సినిమాలో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు పొందిన పలువురు సీనియర్ హీరోలు నటించే అవకాశాలు ఉన్నాయి. విలన్ మరియు ఇతర నటీనటుల క్యాస్టింగ్ గురించి త్వరలోనే తెలియాల్సి ఉంది. ప్రశాంత్ నీల్ లో చిత్రం లో హీరోకి, విలన్ కి పెద్ద తేడా ఏమి ఉండదు. విలన్ వెర్సస్ విలన్ లాగానే ఉంటాయి ఆయన సినిమాల్లోని స్టోరీలు. ఈ కథ కూడా అదే ఫార్మటు లో ఉంటుందని తెలుస్తుంది. ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. కేజీఎఫ్ సిరీస్, సలార్ చిత్రాలకు సంగీతం అందించిన రవి బర్సూర్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నాడు.
Also Read : అత్త పాత్రలో నటిస్తున్న గోపీచంద్ యజ్ఞం సినిమా హీరోయిన్.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే…