Pawan Kalyan assets value: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు ఆయన నుంచి వచ్చిన సినిమాలతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని సెట్ చేశాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. రీసెంట్ గా ఓజీ సినిమాతో సూపర్ సక్సెస్ ని ఎందుకున్న ఆయన హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా మీద భారీ అంచనాలైతే పెట్టుకున్నాడు. ఇక ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ను సాధించి మరోసారి తను కమర్షియల్ సినిమా చేస్తే ఏ రేంజ్ లో ఉంటుందో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు…ఇక పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు చాలా సినిమాలు చేసి మంచి విజయాలు సాధించినప్పటికి ఆయన ఆస్తులను మాత్రం ఎక్కువగా సంపాదించుకోలేదు. సహాయం అడిగిన ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించాడు.
ఆర్థికంగా చాలా మంది కి సహాయాన్ని అందించాడు.మొత్తానికైతే డబ్బులు సంపాదించుకోవాలి అనుకుంటే కొన్ని వేల కోట్లు సంపాదించుకునేవాడు. కానీ ప్రస్తుతం ఆయన దగ్గర కేవలం 500 కోట్ల వరకు ఆస్తులు మాత్రమే ఉన్నాయి. ఇక ఇప్పటివరకు ఆయన తన వైఫ్, పిల్లల మీద ఆస్తులను రాసేశాడు.
ఇక అన్ని కలిపి ఆయనకు 500 కోట్ల వర్త్ కలిగి ఉంటారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఈ మధ్యకాలంలో వచ్చిన కొంతమంది హీరోయిన్లు సైతం భారీ ఆస్తులను సంపాదిస్తున్నారు. 30 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉంటున్న పవన్ కళ్యాణ్ మాత్రం అంత తక్కువ ఆస్తులను కలిగి ఉండడం చూసిన అతని అభిమానులు కూడా చాలా వరకు చింతిస్తున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా ఇకమీదట పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ని ముందుకు తీసుకెళ్తున్నాడు. కాబట్టి డబ్బుల మీద ఆయన ఎక్కువగా ఫోకస్ చేయడం లేదు. జనానికి సేవ చేసే వాళ్ళకి ఆస్తుల విలువ పట్టదని, నిజమైన లీడర్ పవన్ కళ్యాణ్ అని ప్రతి ఒక్కరు అనుకునేలా ఆయన జనానికి సేవ చేస్తుండటం విశేషం…