Allu Arjun: మెగా ఫ్యామిలీ హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ మొదట్లో మంచి విజయాలను అందుకున్నాడు.ఆర్య, బన్నీ లాంటి సూపర్ సక్సెస్ లను అందుకున్న ఆయన ఆ తర్వాత ‘దేశముదురు’ తో భారీ సక్సెస్ ను సాధించి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు. ఇక మొత్తానికైతే అల్లు అర్జున్ సాధించిన విజయాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం అయితే లేదు. ఆయన కాల క్రమేణా చేస్తున్న సినిమాలు కొన్ని ఆశించిన మేరకు విజయాలను అయితే సాధించలేదు. ఇక మొత్తానికైతే ఆయన చేసిన సినిమాల్లో ఒక రెండు సినిమాలు ఆయన చేసి ఉండకపోతే బాగుండు అంటూ ఇప్పటికీ తన అభిమానులు అనుకుంటూ ఉంటారు. అవి ఏంటి అంటే ఒకటి గుణ శేఖర్ దర్శకత్వంలో వచ్చిన వరుడు సినిమా… ఈ సినిమాలో అల్లు అర్జున్ ఏ మాత్రం తన ఇంపాక్ట్ ను చూపించలేదు. ఇక ఈ సినిమా కథ కూడా పెద్దగా ఇంపాక్ట్ ను క్రియేట్ చేయలేకపోయింది. దాంతో ఈ సినిమా డిజాస్టర్ బాట పట్టింది. నిజానికి అల్లు అర్జున్ గుణశేఖర్ తో సినిమా చేయాల్సింది కాదు. కానీ ఆ పర్టిక్యూలర్ సిచువేషన్ లో ఆయన గుణశేఖర్ తో సినిమా చేయాల్సి వచ్చింది. ఇక ఒక్కడు లాంటి సక్సెస్ ని అందిస్తాడు అనుకుంటే ఆయనకు భారీ డిజాస్టర్ ని కట్టబెట్టాడు. ఇక దాంతోపాటుగా కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ సినిమా కూడా అల్లు అర్జున్ కి పెద్దగా ఇమేజ్ అయితే తీసుకురాలేకపోయింది. సినిమా కామెడీగా ఓకే అనిపించినప్పటికి కంటెంట్ పరంగా అంతా గొప్ప సినిమా అయితే కాదు.
ఇక ఈ సినిమా యావరేజ్ గా ఆడినప్పటికీ ఒక స్టాండర్డ్ లో వెళ్తున్న అల్లు అర్జున్ కెరీర్ కి కొంతవరకు బ్రేక్ వేసిందనే చెప్పాలి. అందుకే ఒక నటుడు ఎలాంటి సినిమా చేయాలి అనే దానిమీద కొంతవరకు కసరత్తులను చేసి ముందుకు సాగితే బాగుంటుందంటూ కొంతమంది సినీ మేధావులు కూడా వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమవుతున్న విషయం మనకు తెలిసిందే.
ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకోవాలనే ఉద్దేశ్యంతో తను ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకుంటే మాత్రం పాన్ ఇండియాలో ఆయనకు భారీ మార్కెట్ అయితే క్రియేట్ అవుతుంది.
ఇకమీదట కూడా ఆయన స్టోరీల సెలక్షన్ లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఎందుకంటే ఒక్క సినిమా ప్లాప్ అయిన కూడా పాన్ ఇండియాలో మార్కెట్ అనేది భారీగా తగ్గిపోయే అవకాశాలైతే ఉన్నాయి.అందుకే ఆచితూచి ముందుకు వెళితే మంచిదని సినీ మేధావులు అల్లు అర్జున్ ను హెచ్చరిస్తున్నారు…