Ram Charan: చిరంజీవి నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. నటనలో డాన్సులలో చిరంజీవిని మరిపిస్తున్నాడు. చిరుత చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన రామ్ చరణ్.. టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరిగా ఎదిగాడు. రెండో చిత్రం మగధీరతో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాడు. రంగస్థలం మూవీలో రామ్ చరణ్ నటన మనం ఎప్పటికీ మర్చిపోలేము. ఇక ఆర్ ఆర్ ఆర్ తో గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. రామ్ చరణ్ సక్సెస్ లో చిరంజీవి పాత్ర ఎంతగానో ఉంది.
అయితే చిరంజీవినే రామ్ చరణ్ మోసం చేశాడట. రెండు నెలల తర్వాత చరణ్ చేసిన మోసం చిరంజీవికి తెలిసొచ్చిందట. గతంలో ఓ షోలో రానా, సాయి పల్లవి, చిరంజీవి పాల్గొన్నారు. రానా మాట్లాడుతూ… నేను పదో లేక పదకొండో తరగతిలో ఉన్నప్పుడు చిరంజీవి అంకుల్ ఇంటికి వెళ్ళాను. ఆయన నక్షత్రాలు చూడటానికి ఒక టెలిస్కోప్ ఇంట్లో ఏర్పాటు చేశారు. నేను ఆ టెలిస్కోప్ లో నుంచి చూస్తున్నాను. వెనక నుండి ఎవరో తలపై కొట్టారు.
తిరిగి చూస్తే చిరంజీవి అంకుల్. ఒరేయ్ ముందు దానికున్న మూత తీయరా అన్నాడు. అది నా జీవితంలోని మోస్ట్ ఫన్నీ మూమెంట్, అని అన్నాడు. రానా మాటలకు కొనసాగింపుగా చిరంజీవి… నేను టెలిస్కోప్ క్యాప్ తీయమంటే రానా… మా ఇంటికి కిటికీలకు ఉన్న గ్రిల్ తీశాడు. రామ్ చరణ్-రానా ఇద్దరూ రూమ్ లో చదువుకుంటున్నారని నేను అనుకునేవాడిని. వీరేమో కిటికీ గ్రిల్ తీసేసి, రాత్రంగా తిరిగి, ఆ కిటికీ నుండి రూమ్ లోకి వెళ్లేవారు. ఈ విషయం తెలుసుకోవడానికి నాకు రెండు నెలల సమయం పట్టిందని, అన్నారు.
చిరంజీవి మాటలకు ఆ షోలో ఉన్నవారంతా నవ్వుకున్నారు. రానా, రామ్ చరణ్, శర్వానంద్ క్లాస్ మేట్స్. ముగ్గురు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదివారట. చిన్నప్పటి నుండి ఒకరింటికి మరొకరు వెళుతూ ఉండేవారట. చిరంజీవి ఇంటికి బాల్యంలో రానా తరచుగా వెళ్లేవాడట. అప్పుడు జరిగిన సంఘటన అనుకోకుండా చిరంజీవి బయటపెట్టారు.
రానా, రామ్ చరణ్, శర్వానంద్ ముగ్గురూ పరిశ్రమకు వచ్చారు. మంచి విజయాలు అందుకుని తమదైన మార్క్ వేశారు. ప్రస్తుతం శర్వానంద్, రానా ఒకింత రేసులో వెనుకబడ్డారు. సాలిడ్ హిట్ కోసం ట్రై చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగా 2025 జనవరిలో విడుదల కానుంది.