SBI : దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. డిగ్రీ అర్మతతో 13,735 క్లరికల్ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 17న ప్రారంభం అవుతుంది. జనవరి 7 వరకు అవకాశం ఉంటుంది. అభ్యర్థులు ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత సాధించింది ఉండాలి.
విద్యార్హతలు ఇవీ..
జూనిర్ అసోసియేటెడ్ పోస్టులకు డిగ్రీ ఫైనల్/చివరి సెమిస్టర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. క్లరికల్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూడీ(జనరల్/ఈడబ్ల్యూఎస్) అభ్యర్థులకు ఐదేళ్ల గర్షి›్ట వయోపరిమితి సడలింపు ఉంటుంది.
ఆన్‌లైన్‌లో పరీక్ష..
క్లరికల్ పోస్టులకు పరీక్ష ఆన్‌లైన్‌లోఉంటుంది. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. లోకల్ లాంగ్వేజ్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం ఎస్‌బీఐ వెబ్‌సైట్ జ్టి్ట https://sbi.co.in/ లో చూడొచ్చు. తెలుగు రాష్ట్రాలకు కలిపి 392 పోస్టులు ఉన్నాయి. ఏపీకి 50, తెలంగాణకు 342 పోస్టులు కేటాయించింది.
దరఖాస్తు వివరాలు..
దరఖాస్తు విధానం.. ఆన్‌లైన్‌లో అప్లయ్ చేయాలి.
దరఖాస్తు గడువు : క్లరికల్ పోస్టుల దరఖాస్తుకు డిసెంబర్ 17 నుంచి జనవరి 7 వరకు గడువు ఉంది.
అర్హతలు : ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. చివరి సెమిస్టర్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
వయో పరిమితి : అభ్యర్థుల వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. (రిజర్వేషన్ ఆధారంగా సడలింపు ఉంటుంది)
ఎంపిక విధానం : ఆన్‌లైన్‌లో ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. స్థానిక భాషపై టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.