Vidaamuyarchi Movie: సౌత్ ఇండియా నేటి తరం యూత్ ఆడియన్స్ సూపర్ స్టార్ గా చూసే అతి తక్కువ మంది హీరోలలో ఒకరు అజిత్. తమిళనాడు ప్రాంతం లో ఈయనకి ఉన్న కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ హీరోకి కూడా లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ పెట్టాలంటే అజిత్ తర్వాతే ఎవరైనా. అయితే తమిళ సినిమా ఇండస్ట్రీ కి ఓవర్సీస్ మార్కెట్ చాలా పెద్దది. ఒకప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాతి స్థానం లో ఓవర్సీస్ లో అత్యధిక వసూళ్లను రాబట్టే హీరో గా అజిత్ కి మంచి క్రేజ్ ఉండేది. కానీ సినిమా సినిమాకి ఆయన తన క్రేజ్ ని చెడగొట్టుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఓవర్సీస్ లో తమిళనాడు మీడియం రేంజ్ హీరో సినిమాలకు ఉన్నట్టుగా కూడా లేదు. అజిత్ ఓవర్సీస్ మార్కెట్ ఈ రేంజ్ లో పడిపోతుందని అభిమానులు అసలు ఊహించలేదు.
ఆయన తోటి స్టార్ హీరోలు రజినీకాంత్, విజయ్ వంటి వారు కేవలం నార్త్ అమెరికా ప్రీమియర్ షోస్ నుండే 1 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టి సంచలనం సృష్టిస్తున్నారు. కానీ అజిత్ మాత్రం వాళ్లకు ఆమడదూరం లో ఆగిపోయాడు. మొన్న ఆయన హీరో గా నటించిన ‘విడాముయార్చి’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళ భాషల్లో భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే యావరేజ్ టాక్ ని తెచ్చుకున్న సంగతి తెలిసిందే. కానీ తమిళనాడు లో మాత్రం బంపర్ ఓపెనింగ్ వచ్చింది. అక్కడి ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం తమిళనాడులో ఈ చిత్రానికి మొదటిరోజు 26 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. విజయ్ గత సినిమాలు తమిళనాడులో 30 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించాయి, కానీ విడాముయార్చి జానర్ కి ఆ ప్రాంతంలో అంత వసూళ్లు రావడం మామూలు విషయం కాదు.
కానీ ఓవర్సీస్ లో మాత్రం ఈ చిత్రానికి అతి దారుణమైన ఓపెనింగ్స్ వచ్చాయి. అక్కడి ట్రేడ్ విశ్లేషకుల లెక్కల ప్రకారం ఈ సినిమాకి కేవలం 1.9 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయట. మరోపక్క విజయ్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ చిత్రానికి మొదటిరోజు ఓవర్సీస్ మొత్తం కలిపి 4 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ‘విడాముయార్చి’ అందులో సగం కూడా లేకపోవడం గమనార్హం. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ కి మొదటిరోజు 120 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వస్తే, ‘విడాముయార్చి’ కి కేవలం 47 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. దీనిని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, అజిత్ కి డేంజర్ బెల్స్ మోగాయి. ఇక నుండి ఆయన మంచి సినిమాలు తీయకపోతే స్టార్ హీరోల లీగ్ నుండి తప్పుకున్నట్టే.