https://oktelugu.com/

వెయ్యి కోసం కేఫ్ లో పనిచేశా… బాబాయ్ జపాన్ పిల్ల అనేవాడు

టాలీవుడ్ లో ఆధిపత్యం అంటే మెగా హీరోలదే. అరడజనుకు పైగా హీరోలు పరిశ్రమలో రాణిస్తున్నారు. దశాబ్దాలుగా పరిశ్రమను ఏలుతున్న చిరు ఫ్యామిలీ నుండి ఒక్కరంటే ఒక్క అమ్మాయి కూడా హీరోయిన్ గా మారలేదు. ఆ సాహసానికి ఒడిగట్టింది నాగబాబు కూతురు నిహారిక కొణిదెల. నిర్మాతగా, నటిగా, యాంకర్ గా పలు రంగాలలో అడుగుపెట్టిన నిహారిక ఇటీవలే పెళ్లి చేసుకొని గృహిణిగా మారారు. చిరంజీవి కుటుంబానికి సన్నిహితుడు మిత్రుడు అయినా జొన్నలగడ్డ ప్రభాకరరావు కుమారుడు చైతన్యను నిహారిక వివాహం […]

Written By:
  • admin
  • , Updated On : December 18, 2020 / 04:04 PM IST
    Follow us on


    టాలీవుడ్ లో ఆధిపత్యం అంటే మెగా హీరోలదే. అరడజనుకు పైగా హీరోలు పరిశ్రమలో రాణిస్తున్నారు. దశాబ్దాలుగా పరిశ్రమను ఏలుతున్న చిరు ఫ్యామిలీ నుండి ఒక్కరంటే ఒక్క అమ్మాయి కూడా హీరోయిన్ గా మారలేదు. ఆ సాహసానికి ఒడిగట్టింది నాగబాబు కూతురు నిహారిక కొణిదెల. నిర్మాతగా, నటిగా, యాంకర్ గా పలు రంగాలలో అడుగుపెట్టిన నిహారిక ఇటీవలే పెళ్లి చేసుకొని గృహిణిగా మారారు. చిరంజీవి కుటుంబానికి సన్నిహితుడు మిత్రుడు అయినా జొన్నలగడ్డ ప్రభాకరరావు కుమారుడు చైతన్యను నిహారిక వివాహం చేసుకోవడం జరిగింది. కాగా పలు సందర్భాలలో నిహారిక తన వ్యక్తిగత, మరియు కుటుంబ విషయాలను వెల్లడించారు. నేడు నిహారిక పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఆసక్తికర సంగతులు…

    Also Read: అసలు రంగు బయటపెట్టిన పవన్ భార్య

    చదువు పూర్తయిన వెంటనే ఒక కేఫ్ లో పనిచేయాలని నిహారిక అనుకున్నారట. భిన్న వ్యక్తుల మనస్థత్వాలు, సంస్కృతులు తెలుసుకోవడానికి నిహారిక ఈ నిర్ణయం తీసుకున్నారట. అప్పుడు తనకు వారానికి వెయ్యి రూపాయల జీతం రాగా… అది తన మొదటి సంపాదన అని నిహారిక తెలిపారు. చిన్నప్పుడు తరుచుగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ షూటింగ్స్ లొకేషన్స్ కి నిహారిక వెళ్ళేదట. చిన్న తనంలో నిహారిక కళ్ళు చిన్నవిగా ఉండేవట… దీనితో పవన్ ఆమెను జపాన్ పిల్లా అంటూ ఆటపట్టించేవాడట. అంజి సినిమాలో మొదటిసారి చిరంజీవితో పాటు నిహారిక చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారట. అయితే కొన్ని కారణాల వలన, తన పాత్ర వేరే అమ్మాయితో చేయించారట.

    Also Read: ప్రభాస్ అలాంటోడు అంటున్న పూజ.. వైరల్ అవుతున్న కామెంట్స్

    ఇక హీరోయిన్ అవుతానని అన్నప్పుడు నాగబాబుతో పాటు కుటుంబ సభ్యులు అందరూ షాక్ అయ్యారని నిహారిక చెప్పింది. పెదనాన్న చిరంజీవితో నటించాలన్న కోరిక సైరా ద్వారా తీరినట్లు నిహారిక తెలిపారు. చరణ్ అన్నయ్యను బ్రతిమిలాడి ఆ పాత్రను నేను దక్కించుకున్నాను అని అన్నారు. పాత్ర చిన్నదైనా.. తనకు సంతృప్తిని ఇచ్చిందని నిహారిక చెప్పడం విశేషం. కాగా నిహారిక ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా మారింది. ఆ తరువాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం చిత్రాలలో నటించారు. నిర్మాతగా నాన్న కుచ్చి, మాడ్ హౌస్ అనే వెబ్ సిరీస్ లు నిర్మించారు. నేడు నిహారిక తన 27వ జన్మదినం జరుపుకుంటున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్