Women safety in film industry: ఈమధ్య కాలం లో సినీ సెలబ్రిటీస్ లో ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోతోంది. స్వేచ్ఛగా షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కి వచ్చేందుకు కూడా వీలు లేకుండా పోతోంది. నిధి అగర్వాల్ ‘రాజా సాబ్’ మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్ కోసం హైదరాబాద్ లోని ‘లుల్లూ మాల్’ కి వచ్చి, తిరిగి వెళ్తున్న సమయం లో ఆమెపై అభిమానులు ఎగబడిన ఘటన, ఆ సమయంలో ఆమె నలిగిపోయిన విధానం, చివరకు ఆమె ధరించిన దుస్తులు కూడా చిరిగిపోయి పరిస్థితికి రావడం వంటివి అందరినీ బాధకు గురి చేశాయి. ఈ ఘటన జరిగిన రెండు రోజులకు సమంత విషయం లో కూడా ఇదే రిపీట్ అయ్యింది. జూబిలీ హిల్స్ లో ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్లిన ఆమెపై అభిమానులు ఎగబడ్డారు. ఇప్పుడు అల్లు అర్జున్ సతీమణి, అల్లు స్నేహా రెడ్డి కి కూడా నిన్న అదే పరిస్థితి ఎదురైంది.
Also Read: ఈ సంక్రాంతికి 5 సినిమాలు..అందులో 2 సినిమాలకు సూపర్ హిట్ రిపోర్ట్స్..పూర్తి వివరాలు మీకోసం!
వివరాల్లోకి వెళ్తే నిన్న అల్లు అర్జున్ తన సతీమణి స్నేహా రెడ్డి తో కలిసి హైటెక్ సిటీ లోని నిలోఫర్ కేఫ్ కు వెళ్లారు. అక్కడి నుండి తిరిగి వెళ్లే సమయం లో అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. దీంతో అల్లు అర్జున్ మరియు ఆయన సతీమణి అల్లు స్నేహా రెడ్డి తీవ్రమైన ఇబ్బందికి గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అల్లు అర్జున్ తన భార్య స్నేహ రెడ్డి ని ఒక బాడీ గార్డ్ లాగా కాపాడుకుంటూ కారు వరకు తీసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకు హైదరాబాద్ లో ఎప్పుడూ జరగని ఇలాంటి సంఘటనలు , ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయి?, ఒకప్పుడు మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ కూడా స్వేచ్ఛ గా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఓపెనింగ్ వెళ్లి, బట్ట నలగకుండా తిరిగి వచ్చిన పరిస్థితి ఉండేది.
Also Read: స్పిరిట్ మూవీ గ్లింప్స్ వచ్చేది అప్పుడేనా..?
కానీ ఇప్పుడు ఎందుకు సినీ సెలబ్రిటీలు కనిపిస్తే ఈ విధంగా జనాలు ఎగబడుతున్నారు?, తేడా ఎక్కడ జరుగుతుంది అనేది ఎవరికీ అంతు చిక్కని పరిస్థితి. సినీ సెలబ్రిటీలకు క్రేజ్ ఏమైనా పెరిగిందా?, లేదా ఈవెంట్ ని మ్యానేజర్స్ సరైన ఏర్పాట్లు చేయలేకపోతున్నారా?, పోలీసులు రక్షణ కల్పించడం లో విఫలం అవుతున్నారా ?, ఎక్కడ పొరపాటు జరుగుతోంది?, గడిచిన నెలలో ఇలాంటి సంఘటనలు వరుసగా మూడు జరిగాయి. దీనిపై తక్షణమే ప్రభుత్వం ఎదో ఒక చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే సినీ సెలబ్రిటీలు బయటకు వచ్చే పరిస్థితులు రాబోయే రోజుల్లో ఉండవు. మరి ప్రభుత్వం స్పందిస్తుందో లేదో చూడాలి.