Akhanda 2 buyers losses: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను(Boyapati srinu) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అఖండ 2′(Akhanda 2 Movie) చిత్రం, గత ఏడాది డిసెంబర్ నెలలో భారీ అంచనాల నడుమ విడుదలై బోల్తా కొట్టింది. ఈ క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన మొట్టమొదటి ఫ్లాప్ చిత్రమిదే. గతం లో వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు ఒక దానిని మించి ఒకటి హిట్ అయ్యాయి. ఈ కాంబినేషన్ కి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది. అలాంటి కాంబినేషన్ నుండి వచ్చిన ఈ సినిమా, బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫ్లాప్ గా నిలబడడం అనేది దురదృష్టకరం. సినిమా యావరేజ్ రేంజ్ లో ఉన్నప్పటికీ, బోయపాటి శ్రీను తీసిన కొన్ని ఓవర్ ఫైట్ సన్నివేశాలను సోషల్ మీడియా లో నెటిజెన్స్ వేరే లెవెల్ లో ట్రోల్ చేశారు. ఆ ప్రభావం మామూలు ఆడియన్స్ పై బలంగా పడింది.
Also Read: ‘మన శంకర వరప్రసాద్ గారు’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి.. టాక్ ఎలా ఉందంటే!
ఈ సినిమా ఎదో పెద్ద కళాఖండం లాగా ఉందే, థియేటర్స్ కి వెళ్లి చూస్తే సమయం వృధా, ఓటీటీ లోకి వచ్చినప్పుడు చూసుకోవచ్చు లే అనే మైండ్ సెట్ లోకి వెళ్లిపోయారు. ఇదంతా పక్కన పెడితే, నేడు ఈ సినిమాకు సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాల బయ్యర్లు , డైరెక్టర్ బోయపాటి శ్రీను ని కలిసినట్టు తెలుస్తోంది. తాము డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రాంతాల్లో వచ్చిన నష్టాలను వివరించారట. ప్రతీ ప్రాంతం లోనూ వచ్చిన నష్టాలను చూసి బోయపాటి కి మైండ్ బ్లాక్ అయ్యిందట. తమను దయచేసి ఆదుకోవాలని బోయపాటి శ్రీను వద్ద కన్నీళ్లు పెట్టుకున్నట్టు సమాచారం. నిర్మాతలు రిటర్న్ GST భాగాన్ని జనవరి నెలలో తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారని, ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతీ ప్రాంతం లోను 50 శాతం పైగా నష్టాలు వచ్చాయని, ఈ జీఎస్టీ అమౌంట్ నిర్మాతలు తిరిగి ఇచ్చినా ఆ నష్టాలు పూడవని బయ్యర్స్ ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
Also Read: బాలయ్య ఎందుకని ఆ హిట్ సినిమాను వదులుకున్నాడు…
అయితే ఈ విషయం తన శక్తి మేర చేయగలిగినది చేస్తాను అంటూ బోయపాటి శ్రీను బయ్యర్స్ కి మాట ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి ఉన్న ఆర్ధిక నష్టాలను తొలగించి, విడుదల అయ్యేలా సహకరించిన మ్యాంగో రామ్(సింగర్ సునీత భర్త) తో మాట్లాడమని బోయపాటి తన సన్నిహితులకు చెప్పాడట. ఆ సన్నిహితులు కొంతమంది బయ్యర్స్ ని తీసుకొని నేడు మ్యాంగో రామ్ ని కలిసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా లావాదేవీలు ,అసలు లెక్కలు మొత్తం మ్యాంగో రామ్ కి తెలుసు. ఏ హక్కులు ఇంతకు అమ్మారు, ఎంత మిగిలింది వంటి వివరాలు ఆయన దగ్గరే ఉన్నాయి. చూడాలి మరి ఆయన ఏమి చేస్తాడు అనేది.