WOLF Teaser : హీరో ప్రభుదేవా 60వ సినిమా తెరకెక్కుతుంది వూల్ఫ్. పాన్ ఇండియా చిత్రంగా పలు భాషల్లో విడుదల కానుంది. వూల్ఫ్ టీజర్ విడుదల కాగా మైండ్ బ్లాక్ చేస్తుంది. సన్నివేశాలు గగురికొల్పేలా ఉన్నాయి. పాత్రలు హింసాత్మకంగా ఉన్నాయి. టీజర్ కథపై ఎలాంటి హిట్ ఇవ్వకపోయినా ఇదో మూఢాచారాలు, ఓ వర్గం జుగుప్సాకర చర్యల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రంగా తెలుస్తుంది. మనుషులను బాధించింది వారితో పూజలు చేస్తున్నారు. ఎర్రని వస్త్రాలు ధరించి స్త్రీలు ఓ దేవుడ్ని పూజిస్తున్నారు. ఆ దేవుడికి మనుషుల శరీర భాగాలు నైవేద్యంగా పెడుతున్నారు.
అలాంటి భయంకరమైన పూజలు చేసే వ్యక్తుల బారిన హీరో ప్రభుదేవా పడతాడు. అసలు ఆ పూజలు చేసే భక్తులు ఎవరు? ప్రభుదేవాను ఎందుకు తీసుకొచ్చారు? వాళ్ళ లక్ష్యం ఏమిటీ? ప్రభుదేవా వారి బారి నుండి ఎలా బయటపడ్డాడు? అనే అంశాలు ఆసక్తి రేపుతున్నాయి.
అనసూయ గతంలో ఎన్నడూ చేయని పాత్రలో కనిపించింది. ఆమె పాత్ర క్రూరంగా ఉంది. కళ్ళను పీకి తన దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తుంది. ఎర్రని చీర, ముఖానికి భిన్నమైన మేకప్ తో భయపెడుతుంది. ఆ మిస్టీరియస్ గాడ్ భక్తురాలిగా అనసూయ కనిపిస్తుంది. మరో హీరోయిన్ గా రాయ్ లక్ష్మి నటించారు. ఆమె పాత్ర కూడా గూస్ బంప్స్ కలిగించేదిగా ఉంది. ఈ చిత్ర టైటిల్ వూల్ఫ్ కాగా అనసూయ పూజ చేస్తున్న దేవుడు వూల్ఫ్ అయ్యే అవకాశం ఉంది.
ప్రభుదేవా ఓ భిన్నమైన సబ్జెక్టుతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. మొత్తంగా వూల్ఫ్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. వూల్ఫ్ చిత్రానికి వినో వెంకటేష్ దర్శకుడు. సందేశ్ నాగరాజ్ నిర్మించారు. అమ్రీష్ సంగీతం అందించారు. విడుదల తేదీ ప్రకటించాల్సి ఉంది. ముఖ్యంగా అనసూయకు వూల్ఫ్ మూవీ మరింత ఫేమ్ తెచ్చిపెట్టే అవకాశం కలదు. ఆమె బోల్డ్ సన్నివేశాల్లో కూడా నటించారనిపిస్తుంది.