
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలంటే ఇష్టముండని వారుండరు. బాహుబలి తరువాత ప్రభాస్ రేంజ్ పాన్ ఇండియా లెవల్లో దూసుకెళ్లింది. దీంతో ఆయన సినిమాలన్నీ భారీ ప్రాజెక్టులతో కూడుకొని ఉన్నాయి. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో మూడు సినిమాలు రన్ అవుతున్నాయి. అయితే వీటిని చక్కగా ప్లాన్ వేసుకొని ప్రభాస్ మూడింటికి సేమ్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఆయన నటిస్తున్న ‘రాధే శ్యామ్’సినిమా పూర్తి కావచ్చింది. దీంతో ఆయన ముందుగా ఈ సినిమా కోసం డేట్స్ ఫిక్స్ చేసుకున్నాడు. ఇక ప్రభాస్ నటించబోయే పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’ఇప్పటికే షూటింగ్ ను ప్రారంభించుకుంది.
కరోనా వైరస్ కారణంగా సినీ ఇండస్ట్రీ మూత పడింది. దాదాపు మూడు నెలల తరువాత ఇటీవలే పలు సినిమాల షూటింగ్లు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ నటించే సినిమాలను కూడా పూర్తి కానిచ్చే పనిలో పడ్డారు డైరెక్టర్లు. ప్రభాస్ చేతిలో రాధేశ్యామ్, ఆదిపురుష్, సాలార్ సినిమాలున్నాయి. ఈ మూడింటిలోనూ ప్రభాస్ యాక్టింగ్ మొదలైంది. అయితే ముందుగా రాధేశ్యామ్ పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో పూర్తి షెడ్యూల్ ను ఆ సినిమాకే కేటాయించనున్నాడు.
ఈ తరుణంలో ఆదిపురుష్ టీం ప్రభాస్ లేకుండానే షూటింగ్ స్ట్రాట్ చేసింది. ప్రభాస్ వచ్చేంత వరకు కొన్ని సీన్లను తీయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇందులో సీత పాత్రలో నటిస్తున్న కృతి సనన్ పై కొన్ని సీన్స్ తీయనున్నారు. తాజాగా సీన్ నంబర్ 33 అంటూ కృతి సనన్ కు సంబంధించిన క్లాప్ బోర్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంటే ఆది పురుష్ కు సంబంధించి ఇప్పటికే 32 సీన్లు అయిపోయాయా..? అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
అయితే మధ్య మధ్యలో సీన్స్ తీసి ఆ తరువాత ప్రభాస్ జాయిన్ అవగానే అసలు సీన్స్ మొదలు పెట్టాలని చూస్తున్నాడట డైరెక్టర్ ఓం రౌత్. ఇక ఓం రౌత్ తన ట్విటర్ ఖాతాలో #Adipurush ట్యాగ్ తో షూటింగ్ కు సంబంధించిన సెల్ఫీని అప్లోడ్ చేశాడు. దీంతో ఆ ఫొటో వైరల్ గా మారింది. ఇక ప్రభాస్ రాధే శ్యామ్ షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చే వారంలో ‘ఆదిపరుష్’ కోసం పనిచేసే అవకాశం ఉందని అంటున్నారు. ఆ తరువాత సాలార్ షూటింగ్లో కూడా పాల్గొనే ఛాన్స్ ఉంది.