
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఓ దండగుడు కత్తి చూపించి ఖరీదైన చీర దొంగిలించాడు. 24 గంటల్లోపే నిందితుడిని పట్టుకున్న పోలీసులు అతనిపై కఠినమైన జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేశారు. ఉజ్జయిని టవర్ చౌక్ లోని చీరల దుకాణానికి వెళ్లిన ఓ యువకుడు తొలుత కత్తిని చూపించి బెదిరించాడు. అడ్డుకోబోయిన వారికి పక్కకు నెట్టాడు. దుకాణలో డబ్బు, ఇతర ఖరీదైన వస్తువులేమీ తాకకుండా కేవలం ఒక్క చీర కోసమే ఇలా చేశాడు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగతనానికి పాల్పడింది విక్కీ అనే పాత నేరస్థుడని పోలీసులు గుర్తించారు.