https://oktelugu.com/

Devara Producer  Nagavanshi :  పవన్ కళ్యాణ్ లేకుంటే నేడు ‘దేవర’ కి ఇన్ని వసూళ్లు వచ్చేవి కాదంటూ నిర్మాత నాగవంశీ షాకింగ్ కామెంట్స్!

పాన్ ఇండియా లెవెల్ లో సంచలనం సృష్టించి నేషనల్ అవార్డుని సొంతం చేసుకున్న ఈ చిత్రం, టికెట్ రేట్స్ కారణంగా ఆంధ్ర ప్రదేశ్ లో ఘోరమైన నష్టాలను చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వచ్చింది మన తెలుగు సినిమా. కానీ కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన వెంటనే తెలుగు సినిమాకి మహర్దశ పట్టింది.

Written By:
  • Vicky
  • , Updated On : October 14, 2024 / 09:45 AM IST

    Devara Producer  Nagavanshi

    Follow us on

    Devara Producer  Nagavanshi :  ఆంధ్ర ప్రదేశ్ లో పెద్ద హీరోల సినిమాలకు మళ్ళీ మహర్దశ పట్టింది అనే చెప్పాలి. గత 5 ఏళ్లలో పెద్ద హీరోల సినిమాలు ప్రపంచం మొత్తాన్ని ఊపేస్తుంటే, ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం వసూళ్లు కనపడేవి కాదు. సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేసాడు మాజీ సీఎం జగన్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాలను ఎంతలా తొక్కాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. భీమ్లా నాయక్ , వకీల్ సాబ్ ఈ రెండు చిత్రాలు కూడా కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యాయి. కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం 130 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టాల్సిన ఈ సినిమాలు వంద కోట్ల లోపే ముగిసిపోయాయి. కారణం ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్ రేట్స్ లేకపోవడం.

    ఇప్పుడు సినిమాలన్నీ మహా అయితే వీకెండ్, లేదా వారం రోజులు నడుస్తున్నాయి. భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రాలకు మాత్రమే ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేసిన రెండు సినిమాలు మామూలు కమర్షియల్ సినిమాలే. వకీల్ సాబ్ చిత్రానికి మంచి టాక్ వచ్చింది, వసూళ్లు కూడా బాగా వచ్చాయి,కానీ వీకెండ్ తర్వాత టికెట్ రేట్స్ భారీగా తగ్గించడం, ఆ తర్వాత కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోవడం వల్ల రన్ మధ్యలోనే ఆగిపోయింది. ఒకవేళ టికెట్ రేట్స్ వారం మొత్తం కొనసాగించి ఉండుంటే, ఆ చిత్రానికి 120 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చేవి. భీమ్లా నాయక్ , వకీల్ సాబ్ చిత్రాలతో పాటు, పుష్ప చిత్రానికి కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది.

    పాన్ ఇండియా లెవెల్ లో సంచలనం సృష్టించి నేషనల్ అవార్డుని సొంతం చేసుకున్న ఈ చిత్రం, టికెట్ రేట్స్ కారణంగా ఆంధ్ర ప్రదేశ్ లో ఘోరమైన నష్టాలను చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వచ్చింది మన తెలుగు సినిమా. కానీ కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన వెంటనే తెలుగు సినిమాకి మహర్దశ పట్టింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో ఇండస్ట్రీ లో టికెట్ రేట్స్ విషయంలో ఎలాంటి పరిమితులు పెట్టకుండా పెద్ద సినిమాలకు కోరినంత టికెట్ రేట్స్, కోరినన్ని స్పెషల్ షోస్, బెన్ఫిట్ షోస్ కి అనుమతులు ఇచ్చారు. ‘దేవర’ చిత్రానికి అవన్నీ ఇచ్చిన తర్వాత ఎలాంటి వసూళ్లను చూసామో మన అందరికీ తెలుసు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులను సంపాదించుకున్న నాగ వంశీ మాట్లాడుతూ ‘మేము ఈరోజు దేవర చిత్రానికి కళ్ళు చెదిరే వసూళ్లు చూస్తున్నాం అంటే, అందుకు కారణం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే. మేము ఫార్మ్స్ ని పవన్ కళ్యాణ్ గారి పీఆర్ వేణు గోపాల్ గారికి పంపించాము. ఆయన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లారు. ఇలా ఎన్టీఆర్ గారి సినిమా విడుదల అవుతుంది, టికెట్ రేట్స్, స్పెషల్ షోస్ కి అనుమతి కావాల్సిందిగా కోరాము, ఆయన వెంటనే మంజూరు చేయించాడు’ అంటూ చెప్పుకొచ్చాడు నాగ వంశీ.