https://oktelugu.com/

NBK  Unstoppable 4′ Talk Show : ‘అన్ స్టాపబుల్ 4’ టాక్ షోలో బాలయ్య తో కలిసి సందడి చేయబోతున్న స్టార్ హీరోల లిస్ట్ ఇదే..ఈసారి మామూలుగా ఉండదు!

ఈ నెల 24 వ తారీఖున ఆహా మీడియా లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ సీజన్ లో రాబోయే సెలబ్రిటీస్ గురించి ఇప్పుడు సోషల్ మీడియా లో ఒక చర్చ నడుస్తుంది. మొదటి ఎపిసోడ్ కి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రాగా, రెండవ ఎపిసోడ్ కోసం ఐశ్వర్య రాయి ని అడిగినట్టు తెలుస్తుంది. అలాగే విక్టరీ వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి వంటి వారిని ప్రత్యేకంగా బాలయ్య బాబు కలిసి ఆహ్వానించినట్టు టాక్.

Written By:
  • Vicky
  • , Updated On : October 14, 2024 / 10:21 AM IST

    NBK  Unstoppable 4' Talk Show

    Follow us on

    NBK  Unstoppable 4′ Talk Show :  ఓటీటీ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకొని IMDB లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు అమితంగా ఇష్టపడే టాక్ షోస్ లో 18 వ స్థానంలో నిలిచి సంచలనం సృష్టించిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో మూడు సీజన్స్ పూర్తి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నెల 24 వ తారీఖు నుండి నాల్గవ సీజన్ కూడా మొదలు కానుంది. ‘దసరా’ సందర్భంగా నాల్గవ సీజన్ టాక్ షో కి సంబంధించిన ప్రోమో ని విడుదల చేసారు. కార్టూన్ తో బాలయ్య బాబు ని సూపర్ హీరో గా చూపిస్తూ విడుదల చేసిన ఈ ప్రోమో కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మొదటి ఎపిసోడ్ చిత్రీకరణ కూడా ఇటీవలే పూర్తి అయ్యింది. ఈ మొదటి ఎపిసోడ్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఆయన బాలయ్య బాబు తో చేసిన సందడి, మాట్లాడిన మాటలు ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని విశేషంగా అలరిస్తుందని అంటున్నారు.

    ఈ నెల 24 వ తారీఖున ఆహా మీడియా లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ సీజన్ లో రాబోయే సెలబ్రిటీస్ గురించి ఇప్పుడు సోషల్ మీడియా లో ఒక చర్చ నడుస్తుంది. మొదటి ఎపిసోడ్ కి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రాగా, రెండవ ఎపిసోడ్ కోసం ఐశ్వర్య రాయి ని అడిగినట్టు తెలుస్తుంది. అలాగే విక్టరీ వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి వంటి వారిని ప్రత్యేకంగా బాలయ్య బాబు కలిసి ఆహ్వానించినట్టు టాక్. రీసెంట్ గా వెంకటేష్ – అనిల్ రావిపూడి మూవీ సెట్స్ కి బాలయ్య వచ్చి కలిసిన ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. బాలయ్య ఆరోజు వెంకటేష్ ని కలవడానికి కారణం అన్ స్టాపబుల్ షో కోసమే అని టాక్. ఇక మెగాస్టార్ చిరంజీవి ఈ సీజన్ చివరి ఎపిసోడ్ కి రాబోతున్నట్టు తెలుస్తుంది. వీరితో పాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కూడా ఒక ఎపిసోడ్ కి రాబోతున్నారట. ఇక డైరెక్టర్స్ క్యాటగిరీ నుండి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక ఎపిసోడ్ కి వస్తారట.

    అయితే నందమూరి అభిమానులు చాలా కాలం నుండి ఈ షో కి జూనియర్ ఎన్టీఆర్ వస్తే బాగుంటుందని కోరుకున్నారు. ఎందుకంటే బాలయ్య బాబు, జూనియర్ ఎన్టీఆర్ మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది అనే రూమర్ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం అవుతుంది. దీనికి అడ్డుకట్ట వేయడానికే ఎన్టీఆర్ రావాలని కోరుకున్నారు. ఆహా మీడియా టీం ఆ ప్రయత్నాలు కూడా చేసే ఆలోచనలో ఉన్నారట కానీ, ఇప్పటి వరకు ఖరారైన టాప్ సెలబ్రిటీస్ కేవలం వీళ్ళు మాత్రమే అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. రాబోయే రోజుల్లో మరికొంత మంది టాప్ సెలెబ్రిటీలు ఈ సీజన్ లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయట, వారిలో తమిళ ఇండస్ట్రీ టాప్ హీరోలు కూడా ఉన్నారని తెలుస్తుంది.